Skip to main content

27 నుంచి ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు

సాక్షి, భీమవరం: పాఠశాలలు, కళాశాలలో చేరి చదువుకోవడానికి వీలుకాని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఓపెన్‌ స్కూల్‌ విద్యను ప్రోత్సహించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు.
Open school admissions from july 27
27 నుంచి ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు

బుధవారం కలెక్టరేట్‌లో ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ 2023–24లో పదో తరగతిలో 831, ఇంటర్మీడియెట్‌లో 2,331 అడ్మిషన్లు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదలయ్యిందని ఈనెల 27 నుంచి వచ్చేనెల 31 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 28న ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల ప్రక్రియపై ఓరియంటేషన్‌ ప్రోగ్రాం, ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అలాగే వచ్చేనెల 5వ తేదీ వరకు ఓపెన్‌ స్కూల్‌పై అవగాహన వివిధ రకాలుగా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారిని కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశించారు.

5న జిల్లాపరిషత్‌సర్వసభ్య సమావేశం

ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజాపరిషత్‌ స్థాయి సంఘ సమావేశాలు, జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన వచ్చేనెల 5న ఉదయం 10 గంటల నుంచి ఏలూరు జెడ్పీ సమావేశపు హాలులో నిర్వహిస్తామని జెడ్పీ సీఈఓ కె.రవికుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజాపరిషత్‌ 1 నుంచి 7వ స్థాయి సంఘ సమావేశాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతాయని, మధ్యాహ్నం 2 గంటల నుంచి జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తామని తెలిపారు.

కార్గిల్‌ విజయ్‌ దివస్‌

తాడేపల్లిగూడెం (టీఓసీ): వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన కళాశాలలో బుధవారం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను నిర్వహించారు. వర్సిటీ డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ ఆఫైర్స్‌ డాక్టర్‌ ఎస్‌.సలోమి సునీత హాజరై మాట్లాడుతూ మాతృభూమి కోసం ప్రాణాలను తెగించి పోరాడిన సైనికుల పోరాటాన్ని, దేశభక్తిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సైని క కుటుంబాలు చేస్తున్న త్యాగాలను జ్ఞాపకం ఉంచుకొని గౌరవించాలన్నారు. వకృత్వ పో టీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. అసోసియేట్‌ డీన్‌ ఎం.మాధవి, ఎన్‌ఎస్‌ఎస్‌ కో–ఆర్డినేటర్స్‌ సీపీ విజ్జి, శివకుమార్‌, ఉదయశ్రీ మాట్లాడారు.

మెరుగైన వైద్య సేవలే లక్ష్యం

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రభుత్వ వైద్యులు పోటీతత్వంతో ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో వైద్యశాఖ అధికారులు, వైద్యులతో ఆమె సమీక్షించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు కచ్చితంగా పెరగాలని కలెక్టర్‌ అన్నారు. కంటి వెలుగు కార్యక్రమం కింద కంటి పరీక్షలు శాతం తక్కువగా ఉండటంపై వివరణ కోరారు. నూరుశాతం కంటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమంలో వైద్య సేవలను పెద్ద ఎత్తున అందించాలన్నారు. ఇమ్యునైజేషన్‌ కార్యక్రమంలో లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి మాతృ సంపద యోజన పథకంలో భాగంగా తొమ్మిదో నెలలో వైద్య సహాయం కోసం వచ్చిన గర్భిణులకు మహిళా సంక్షేమ శాఖ తప్పక ఆహారాన్ని అందించాలన్నారు. డీఎంహెచ్‌ఓ డి.మహేశ్వరరావు, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ భానునాయక్‌, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారి బి.సుజాత రాణి, డీఐఓ దేవ సుధ, పీహెచ్‌సీల అధికారులు పాల్గొన్నారు.

విద్యుత్‌ కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): భారీ వర్షాలు, గోదావరి వరద నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశామని విద్యుత్‌ సంస్థ ఏలూరు సర్కిల్‌ పర్యవేక్షక ఇంజనీర్‌ పి.సాల్మన్‌రాజు ఓ ప్రకటనలో తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఏలూరులోని రామచంద్రరావు పేట విద్యుత్‌ భవన్‌లో 9440902926, జంగారెడ్డిగూడెం డివిజన్‌ ఆఫీసులో 9491030713 నంబర్లతో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. వర్షాల కారణంగా తెగిపడిన విద్యుత్‌ వైర్లను, విద్యుత్‌ స్తంభాలను ప్రజలు తాకవద్దని విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ అంతరాయం లేదా సమస్య తలెత్తితే టోల్‌ఫ్రీ నంబర్‌ 1912కు గాని కంట్రోల్‌రూమ్‌ నంబర్‌ 9440902926కు ఫోన్‌ చేసి తెలియజేయాలని కోరారు.

Published date : 27 Jul 2023 05:09PM

Photo Stories