NMMS Exam: ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి
అనంతపురం ఎడ్యుకేషన్: ఈనెల 3న నిర్వహించనున్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నాగరాజు తెలిపారు. స్థానిక పాత డీఈఓ కార్యాలయంలో భద్రపరిచిన ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు సమీపంలోని పోలీస్‌స్టేషన్లకు సీఎస్, డీఓల ద్వారా శుక్రవారం తరలించారు. పరీక్ష రోజు ఆయా పోలీస్‌స్టేషన్ల నుంచి తెచ్చుకోవాలని డీఈఓ సూచించారు. ఈ సందర్భంగా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో డీఈఓ సమావేశం ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 13 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందన్నారు. మొత్తం 2,886 మంది ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిస్తే నాలుగేళ్లపాటు ఉపకార వేతనం రూ.48 వేలు మంజూరవుతుందన్నారు. హాల్ టికెట్లను ఆయా స్కూల్స్ హెచ్‌ఎంలు డౌన్‌లోడ్ చేసి, విద్యార్థులకు అందించాలన్నారు. సమావేశంలో ప్రభు త్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్, డీసీఈబీ కార్యదర్శి పురుషోత్తం బాబు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి నాగరాజు
చదవండి: NMMS Exam Question Paper: జిల్లాకు చేరిన ‘ఎన్‌ఎంఎంఎస్’ ప్రశ్నపత్రాలు