NMMS Exam Question Paper: జిల్లాకు చేరిన ‘ఎన్‌ఎంఎంఎస్’ ప్రశ్నపత్రాలు
అనంతపురం ఎడ్యుకేషన్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు గురువారం జిల్లాకు చేరాయి. ఈనెల 3న పరీక్ష జరగనుంది. అనంతపురం డీఈఓ కార్యాలయం (పాత ఆఫీస్)లో వీటిని భద్రపరిచారు. జిల్లా విద్యాశాఖ అధికారి వి.నాగరాజు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ పరిశీలించారు. ప్రశ్నపత్రాలను శుక్రవారం పరీక్ష కేంద్రాలకు తరలించనున్నారు. జిల్లాలో మొత్తం 13 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ రెవెన్యూ డివిజన్ కేంద్రాలైన అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లులోనే ఉన్నాయి. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మొత్తం 2,886 పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని డీఈఓ నాగరాజు ఆదేశించారు. ఏ కేంద్రంలోనూ సమస్యలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
చదవండి: NMMS 2023 Exam: 3న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష