Schools: పాఠశాలల్లో డీఈవోల తనిఖీలు
పాడేరు రూరల్ : జిల్లాలోని ఎంపిక చేసిన 742 యాజమాన్యల పాఠశాలలకు నవంబర్ 3న శుక్రవారం స్టేట్ ఎడ్యుకేషనల్ అచివ్‌మెంట్ టెస్ట్ నిర్వహించారు. 39 మంది మండల విద్యాశాఖ అధికారులు ఇన్విజిలేటర్లుగా వ్యవహరించారు. జిల్లాలో 1782 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణ తీరును జిల్లా విద్యాశాఖాధికారి బి.గౌరీశంకర్‌రావు పరిశీలించారు. పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల లగిసపల్లి కేజీబీవీ పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి గౌరీశంకర్‌రావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జి.అప్పారావు నాయుడు సందర్శించారు.
చదవండి: Govt Medical College: వైద్య కళాశాల పనులు షురూ
గంగవరం : మండలంలోని నెల్లిపూడి, టేకులవీధి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల, సీహెచ్.నెల్లిపూడి ఎంపీపీ స్కూల్‌లో నవంబర్ 3న శుక్రవారం నిర్వహించిన స్టేట్ ఎడ్యుకేషన్ ఎచీవ్‌మెంట్ పరీక్షలను ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3, 6, 9 తరగతుల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులకు ప్రతిభను గుర్తించి తననుగుణంగా పాఠ్యాంశాలు బోధన జరుగుతుందన్నారు. ఆయన వెంట టేకులవీధి గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాల హెచ్‌ఎం బి.నాగేశ్వరరావు ఉన్నారు.