School Inspection: విద్యార్థులు ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలి
![Education department Inspecting the school, students, incentives](/sites/default/files/images/2023/10/18/school-inspection-1697626424.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం అన్నారు. గురువారం పీలేరు మండలంలోని ఎనుమలవారిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. విద్యార్థులతో ఇంగ్లీషు, హిందీలో భాషా పరిజ్ఞానంపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
Show Cause Notice: కళాశాలకు షోకాజ్ నోటీసులు.. కారణం?
ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి విద్యార్థులకు ఇంగ్లీషులో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించాలన్నారు. అలాగే ఇంట్రాక్టివ్ ప్యానెల్ బోర్డులు ఉపయోగించి నూతన సాంకేతికతను జోడించి బోధించాలన్నారు. విద్యార్థులకు రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు ఇవ్వాలని సూచించారు. ప్రతి వారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మేసెజ్ లింక్‌ను జిల్లాలోని అన్ని పాఠశాలలకు పంపుతామని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు లోకేశ్వర్‌రెడ్డి, పద్మావతి, హెచ్‌ఎంలు వేణుగోపాల్‌రెడ్డి, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు.