Model School Entrance Exam: మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలో తనిఖీ.. హాజరైన విద్యార్థుల సంఖ్య!
నంద్యాల: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరిగిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిందని మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక మోడల్ స్కూల్ పరీక్ష కేందాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశానికి 36,079 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 31,376 మంది పరీక్ష రాశానన్నారు. శిరివెళ్ల మోడల్ స్కూల్‌లో 146 మంది గాను 129 మంది విద్యార్థులు హాజరయ్యాన్నారు.
SBI Workers Salary: ఎస్‌బీఐ కాంట్రాక్టు వర్కర్లకు కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలి
త్వరలోనే ఫలితాలు వెలుబడుతాయన్నారు. ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల భర్తీ జరుగుతుందన్నారు. ఆయన వెంట ఎంఈఓ శంకర్ ప్రసాద్, ప్రిన్సిపాల్ ఇష్రత్‌బేగం ఉన్నారు. నంద్యాల జిల్లాలో 21 పరీక్ష కేంద్రాల్లో 3,651 మంది విద్యార్థులకు గాను 3,175 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు డీఈఓ సుధాకర్‌రెడ్డి తెలిపారు. 476 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు.
TS 10th Class Results: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..