Skip to main content

Increase of Admissions: ప్రతీ మండలంలో ఒక హైస్కూల్‌ ప్లస్‌ కళాశాల

పాఠశాలల్లో కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉండాలని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రతి మండలంలో పాఠశాలతోపాటు కళాశాలను నిర్వహించాలని ఆదేశించారు.
Increase of admissions for students at schools and colleges

పెడన: జిల్లాలోని హైస్కూల్‌ ప్లస్‌ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉండేలా చూడాలని జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఒక            కో-ఎడ్యుకేషన్‌ హైస్కూల్‌ ప్లస్‌ కళాశాల, మరొకటి బాలికల హైస్కూల్‌ ప్లస్‌ కళాశాల నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ఆయా ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు, సంబంధిత హైస్కూల్‌ ప్లస్‌ ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.

Nannaya University: యూనివర్సిటీలో పెండింగ్‌ పనులకు శ్రీకారం

ఆ ప్రకారం ప్రారంభించని పాఠశాలల్లో హైస్కూల్‌ ప్లస్‌ తరగతులను 2024–25 విద్యా సంవత్సరానికి ప్రారంభించి ఎంపీసీ, బైపీసీ, సీఈసీల్లో ఏవైనా రెండు గ్రూపులు ఉండేలా చూడాలన్నారు. ప్రతి గ్రూపులో 40 మంది విద్యార్థులుండాలని సూచించారు. ఆ దిశగా సంబంధిత ఉపాధ్యాయులు, అధికారులు చర్యలు చేపట్టాలని డీఈఓ ఆదేశించారు.

AP Tenth Exams: టెన్త్‌ పరీక్షలకు అన్ని విధాల భద్రతా చర్యలు

Published date : 07 Mar 2024 01:02PM

Photo Stories