‘నవోదయ’ విద్యార్థులకు అస్వస్థత
Sakshi Education
పెదవేగి: పెదవేగి జవహర్ నవోదయ విద్యాలయాలో ఆటల పోటీలకు కేరళ, కర్నాటక, తెలంగాణ నుంచి వచ్చిన 12 మంది విద్యార్తులు ప్రాంతాల మార్పుతో శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు.
వారిని గోపన్నపాలెం పీహెచ్‌సీకి తరలించి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ ముగ్గురికి వాంతులయ్యాయని, తొమ్మిది మంది శారీరక నొప్పులతో వచ్చారన్నారు. విద్యార్థులు అలుపెరుగకుండా ఆటలు ఆడటంతోపాటు గురువారం రాత్రి బిర్యాని తిన్నారన్నారు. వాతావరణంలో మార్పులు కారణమని, ఫుడ్ పాయిజన్ కాదన్నారు. ఎండలో ఆటలాడటంతో డీ హైడ్రేడ్ అయ్యిందన్నారు. విద్యార్థులను డీఎంహెచ్‌ఓ నాగేశ్వరరావు పరామర్శించారు. పలువురు అధికారులు జవహర్ నవోదయ విద్యాలయాకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. మరో 20 మంది విద్యార్థులు జ్వరాలతో బాధపడుతుండగా పెదవేగి పీహెచ్‌సీ వైద్యులు నవోదయ పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు.
Published date : 05 Aug 2023 04:02PM