SAKSHI SPELL BEE: దిగ్విజయంగా 12వ ఎడిషన్‌లోకి ‘సాక్షి స్పెల్ బీ’... ఈ లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి
ఈ పోటీలకు పాఠశాలల వారీగా, వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. నాలుగు రౌండ్లలో, నాలుగు కేటగిరీల్లో ఈ పోటీలు జరుగుతాయి. ఆగస్టు నుంచి స్పెల్ బీ పోటీలు ప్రారంభంకానున్నాయి.
కేటగిరీ-1లో ఒకటి, రెండో తరగతులు;
కేటగిరీ-2లో 3, 4 తరగతులు;
కేటగిరీ-3లో 5, 6, 7 తరగతులు;
కేటగిరీ-4లో 8, 9, 10 తరగతుల వారికి పోటీలు నిర్వహిస్తారు.
ఇవీ చదవండి: వీసా లేకుండానే 57 దేశాలను చుట్టిరావొచ్చు... ఆ దేశాలేవో ఇక్కడ తెలుసుకోండి..
పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతి రూ. 8వేలు, రెండో బహుమతి రూ. 5 వేలు, మూడో బహుమతి రూ. 3 వేలతోపాటు ‘చాంపియన్ స్కూల్ ట్రోఫీ’, విజేతలకు మెడల్స్, పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేస్తారు.
పాఠశాల యాజమాన్యాలు, విద్యార్థులు www.arenaoneschoolfest.com వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 250 (ఇండియా స్పెల్స్ రిఫరెన్స్ బుక్‌తో కలిపి).
ఫీజును ‘ఇండియా స్పెల్ బీ, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ (Indira Television Limited) అకౌంట్ నంబర్ A/C NO: 30769357760, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్ కోడ్ SBIN0008022, బంజారాహిల్స్ శాఖ, హైదరాబాద్ ఖాతాలో జమ చేయాలి.
ఇవీ చదవండి: వరుసగా మరో మూడు రోజులు పాటు స్కూల్స్, కాలేజీకు సెలవులు.. కారణం ఇదే..!
మరిన్ని వివరాలకు 9505551099 / 9705199924 నంబర్లలో లేదా మెయిల్ sakshispellbee1@gmail.com ద్వారా ఉదయం 10 నుంచి 6 గంటల మధ్యలో సంప్రదించవచ్చు.
మొదటి రౌండ్ ఇలా...
మొదటి రౌండ్ ప్రాథమికస్థాయిలో ఉంటుంది. రాత పరీక్షను పాఠశాల యాజమాన్యమే నిర్వహిస్తుంది. ప్రశ్నాపత్రాన్ని సాక్షి స్పెల్ బీ(SSB) పంపుతుంది.
రెండో రౌండ్...
రెండో రౌండ్ జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. 'సాక్షి స్పెల్ బీ' ఏర్పాటు చేసిన వేదికలో విద్యార్థులు పరీక్ష రాస్తారు. టీచర్ చెప్పిన మాటలు విని విద్యార్థి పరీక్ష రాయాల్సి ఉంటుంది.
Success Story: గూడెం నుంచి అమెరికాకు... ఈ వరంగల్ ప్రొఫెసర్ సక్సెస్ జర్నీ సాగిందిలా..!
మూడో రౌండ్...
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ లలో మూడో రౌండ్ నిర్వహిస్తారు. సెకండ్ రౌండ్‌లో పరీక్ష రాసిన విధంగానే మూడో రౌండ్లోనూ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది.
నాలుగో రౌండ్...
నాలుగో రౌండ్‌ను హైదరాబాద్ లో నిర్వహిస్తారు. ఇది పూర్తిగా మౌఖిక పరీక్ష(Oral test). రెండు తెలుగు రాష్ట్రాలకు ఫైనల్స్ వేర్వేరుగా నిర్వహిస్తారు.