Skip to main content

Vidyarthi Vidyan Manthan : విద్యార్థుల ప్ర‌తిభ‌కు 'విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్' ప‌రీక్ష.. ఎందులో ఎంపికైతే..!

విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు, వారిలో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలను ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
Vidyarthi Vidyan Manthan exam for students talent

పార్వతీపురం టౌన్‌: ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు విజ్ఞాన్‌ మంథన్‌ పరీక్షలో పాల్గొనేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. రోజూ ఒక గంట కోచింగ్‌ ఇచ్చేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 20 నుంచి 30 వరకు విద్యార్థుల నమోదు ఉంటే ఆ పాఠశాలలకు పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు.

– జి. పగడాలమ్మ, జిల్లా విద్యాశాఖాధికారి, పార్వతీపురం మన్యం

Medical College: మెడికల్‌ కళాశాలకు మంగళం!

విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు, వారిలో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలను ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. విద్యార్థులు పరిశోధన, ప్రయోగాల్లో రాణించేలా ఏటా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ (వీవీఎం)పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్షను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సమాచార సంస్థ ఆధ్వర్యంలో ఎన్‌సీఈఆర్‌టీ, విజ్ఞాన ప్రసాద్‌, విజ్ఞాన భారతి సంయుక్తంగా విద్యార్థి విద్యాన్‌ మంథన్‌(వీవీఎం) పేరిట ఏటా ప్రతిభాన్వేషణ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 2024–25 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో 1599 వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఈ పాఠశాలల్లో 1,18,569 లక్షల మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ చదువుతున్న వారికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారు భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌, స్కాలర్‌ షిప్‌ పొందే అవకాశం ఉంది.

Thalli Vandanam : బ‌డులు పునఃప్రారంభం.. మ‌రి తల్లి వంద‌నం!

’జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో..

పోటీ పరీక్షను జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో నిర్వహిస్తారు. 6–8 తరగతులకు జూనియర్‌, 9–11 తరగతులకు సీనియర్‌ గ్రూపుగా ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లిషు తదితర భారతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థుల ఆసక్తిని బట్టి వారికి నచ్చిన భాషలో పరీక్ష రాయవచ్చు.

100 మార్కులకు పరీక్ష

ఈ పరీక్షకు సంబంధించి మాక్‌ పరీక్ష అక్టోబర్‌ 10న నిర్వహిస్తారు. ప్రధాన పరీక్ష అక్టోబర్‌ 29, 30 తేదీల్లో ఉంటుంది. అయితే ఇందులో ఏదో ఒక రోజు పరీక్ష రాసే వెసులుబాటు ఉంది. ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యకాలంలో 90 నిమిషాల పాటు పరీక్షను రాయాల్సి ఉంటుంది. పరీక్ష రాసే ప్రతి విద్యార్థి ఒకసారి యాప్‌లో లాగిన్‌ అవగలుగుతారు. పరీక్ష పూర్తిగా అబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. జూనియర్‌, సీనియర్‌ రెండు విభాగాల్లోనూ 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చోప్పున 100 మార్కులు కేటాయిస్తారు. సెక్షన్‌ –ఎ లో విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ మేధావుల కృషి 20 ప్రశ్నలు, సెక్షన్‌–బిలో జూనియర్‌, సీనియర్‌ విద్యార్థులకు గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, రీజనింగ్‌ 10 ప్రశ్నలు ఉంటాయి.

Job Mela: రేపు జాబ్‌మేళా.. జీతం రూ. 35వేల వరకు

ఆసక్తి ఉన్న విద్యార్థులు రూ. 200రుసుం చెల్లించి విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ అనే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ ఏడాది మే 19న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్‌ 15వ తేదీన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు ముగుస్తుంది. ప్రవేశపరీక్ష ఆన్‌లైన్‌ పద్ధతిలో పాఠశాల స్థాయిలో నిర్వహించనున్నారు. పరీక్ష జరిగే రోజు విద్యార్థులకు వారికి అందుబాటులో ఉన్న అండ్రాయిడ్‌, మొబైల్‌, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌, డిజిటల్‌ పరికరాలను ఏదైనా ఒక దాని ద్వారా పరీక్షకు నిర్దేశించిన అప్లికేషన్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని వారి ఇంటి నుంచే పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షలు ఉంటుంది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఇప్పటికే వైబ్‌సైట్‌లో పుస్తకాలు అందుబాటులో ఉంచారు.

World's First Miss AI: ప్రపంచంలోనే తొలి 'మిస్‌ ఏఐ' కిరీటాన్ని దక్కించుకుంది ఎవరో తెలుసా?

Published date : 11 Jul 2024 09:43AM

Photo Stories