School Development: పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు..
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో సక్రమంగా ఖర్చు చేయాలని డీఈవో అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతువేదికలో బుధవారం పలు పాఠశాలల హెచ్‌ఎంలు, గ్రామ సమాఖ్య సంఘాల అధ్యక్షురాళ్లతో సమావేశమయ్యారు.
Freedom Prize: అలెక్సీ నవల్నీ, యులియా నవల్నాయకు ఫ్రీడమ్ ప్రైజ్
డీఈవో మాట్లాడుతూ జిల్లాలోని 685 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఎస్‌ఎంసీల స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. వేసవి సెలవులు ముగిసి.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా వసతుల కల్పన పనులు పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లోని సమస్యలను గుర్తించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల నోడల్ అధికారి ఉదయ్‌బాబు, ఎస్‌వోలు భరత్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
AP Inter Results 2024 Updates : ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 విడుదలపై బోర్డ్ కీలక ప్రకటన..