Free Admissions: పేద విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు..
సాక్షి ఎడ్యుకేషన్: ప్రైవేట్ స్కూళ్లలో ఒకటో తరగతిలో పేద విద్యార్థులకు ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు, ఇందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ కె.శామ్యూల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న పిల్లలు(అనాథలు, హెచ్‌ఐవీ భాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు చెందిన పేదలు) ఇందుకు అర్హులని పేర్కొన్నారు.
Show Cause: షోకాజ్ నోటీసులు జారీ..!
ఈ నెల 23 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు https://cse.ap. gov.in అనే వెబ్‌సైట్‌లో రిజిష్టర్ చేసుకోవాలన్నారు. గ్రామ సచివాలయం, మండల విద్యా వనరుల కేంద్రం, సంబంధిత పాఠశాల నుంచే దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. అర్హులైన విద్యార్థులకు లాటరీ ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 18004258599కు ఫోన్ చేయవచ్చునన్నారు.