Show Cause: షోకాజ్ నోటీసులు జారీ..!
Sakshi Education
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన డీఈఓ అక్కడి పరిస్థితి తెలుసుకుని ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు.. అసలు వివరాలను పరిశీలించండి..
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు సరిగా వేయని 175 మంది ప్రధానోపాధ్యాయులకు శనివారం డీఈఓ రామారావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల హాజరును ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఉదయం 10.30 గంటల లోపే యాప్‌ల ద్వారా నమోదు చేయాల్సి ఉంది.
Teachers as Students: టీచర్లు కూడా విద్యార్థులుగానే ఉండాలి..
అయితే శుక్రవారం సుమారు 3,300 మంది విద్యార్థులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కానీ, ప్రధానోపాధ్యాయులు కానీ హాజరు వేయకపోవడాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించి షోకాజ్ నోటీసులు అందజేశారు. సంబంధిత హెచ్‌ఎంలు వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
Published date : 18 Feb 2024 03:02PM