Skip to main content

Four Days School & Colleges Holidays : వ‌రుస‌గా స్కూల్స్‌, కాలేజీల‌కు నాలుగు రోజులు పాటు సెల‌వులు.. ఎందుకంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ ఏడాది స్కూల్స్‌, కాలేజీ విద్యార్థులు ఇటు పండ‌గలు.. అటు వాన‌ల‌తో వ‌చ్చే సెల‌వుల‌తో నిజంగా పండ‌గ చేసుకుంటున్నారు. అలాగే కొన్ని అనుకోని సెల‌వులు బంద్‌లు, వాన‌లతో నిజంగా సెల‌వుల‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
Four Days School & Colleges Holidays News in Telugu,Rainy season holidays,
Four Days School & Colleges Holidays

గ‌త ఏడాది కంటే.. ఈ ఏడాదే స్కూల్స్‌, కాలేజీల‌కు అత్యధికంగా సెలవులు వ‌స్తున్నాయి. తాజాగా ఇప్పుడు మ‌రోసారి స్కూల్స్‌, కాలేజీల‌కు వ‌రుస‌గా నాలుగు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. ఎలా అంటే.. సెప్టెంబ‌ర్ 28వ తేదీన (గురువారం) మిలాద్ ఉన్ నబీ, హైద‌రాబాద్‌లో వినాయక నిమజ్జనం, సెప్టెంబ‌ర్ 30వ తేదీ (శ‌నివారం), అక్టోబ‌ర్ 1వ తేదీన (ఆదివారం), అక్టోబ‌ర్ 2వ తేదీ (గాంధీ జయంతి) దీంతో నాలుగు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. అలాగే సెప్టెంబ‌ర్ 29వ తేదీన‌ (శుక్ర‌వారం) ఆ ఒక్క రోజు సెల‌వు తీసుకుంటే.. వ‌రుస‌గా ఐదు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి.

☛ Schools & Colleges Dussehra Holidays 2023 : తెలంగాణ‌, ఏపీలో భారీగా దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు అంటే..?

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలంలో భారీ వ‌ర్షాల కార‌ణంతో కూడా కొన్ని కొన్ని స్కూల్స్‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.  అలాగే కచ్చితమైన సెలవుల గురించి తెలుసుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత స్కూల్‌, కాలేజీ హాలిడే షెడ్యూల్‌ను చెక్ చేసుకోని.. మీరు సెల‌వు తీసుకోవ‌చ్చును.

తెలంగాణ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

schools holidays list 2023-24 news telugu

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు క్రిస్ట‌మ‌స్ సెల‌వులు (మిష‌న‌రీ స్కూల్స్‌కు మాత్ర‌మే..)
☛ ఇంకా దీపావ‌ళి, ఉగాది, రంజాన్ మొద‌లైన పండ‌గ‌ల‌కు ఆ రోజును బ‌ట్టి సెల‌వులు ఇవ్వ‌నున్నారు.

☛ Tenth and Inter Public Exams : ఇక‌పై.. ఏడాదికి రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు.. కొత్త‌ రూల్స్ ఇవే..

Published date : 22 Sep 2023 07:54AM

Photo Stories