FA-2 Examinations: ప్రారంభమైన ఎఫ్ఏ-2 పరీక్షలు
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా తొలిరోజు మంగళవారం ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 2 పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించినట్లు జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి హేమారెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పరీక్షలు జరిగాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
Intermediate Admissions: అనూహ్యంగా పెరిగిన ఇంటర్ అడ్మిషన్లు
రాష్ట్ర ఉన్నతాధికారులు జారీ చేసిన షెడ్యూల్ మేరకు ఫార్మేటివ్ పరీక్షలు ఒకటి నుంచి పదో తరగతి వరకు జరుగుతాయన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 94,901 మంది, ఆరు నుంచి పదో తరగతి వరకు 1,11,750 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. తొలిరోజు పరీక్షను పలు పాఠశాలల్లో తనిఖీ చేసినట్లు ఆయన వెల్లడించారు.