Tabs for Students: సాంకేతిక నైపుణ్యం పెంచేందుకు డిజిటల్ బోధన
గణపవరం/నిడమర్రు: ప్రభుత్వం ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన డిజిటల్ విద్యా విధానాన్ని ఉపాధ్యాయులు నూరుశాతం అమలు చేయాలని డీఈఓ అబ్రహం సూచించారు. గురువారం ఆయన గణపవరం, నిడమర్రు మండలాల్లోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల నోటు పుస్తకాలు, వర్కు బుక్కులను పరిశీలించి విద్యార్థులను ప్రశ్నలు అడిగారు.
YVU Graduation Day: వైవీయూలో స్నాతకోత్సవానికి దరఖాస్తుల గడువు పెంపు..!
ప్రతి పాఠశాలకు ఐఎస్‌పీ ప్యానల్స్, స్మార్ట్ టీవీలు అందజేశామని, వీటిని తప్పక వినియోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిప్పర, అర్ధవరం, గణపవరం బాలుర ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలు, ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. ఎంఈఓలు శేషు, గొర్రెల బాలయ్య, హెచ్‌ఎంలు ఉన్నారు.
Farming: రైతుగా మారిన లెక్చరర్..
నిడమర్రు మండలంలో డిజిటల్ బోధనా ఫలాలను అందుకోవడానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాలని డీఈఓ అబ్రహం సూచించారు. గురువారం నిడమర్రు మండలం బువ్వనపల్లి ప్రీహైస్కూలు, నిడమర్రు హైస్కూళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎనిమిదో తరగతి విద్యార్థుల ట్యాబ్‌ల వినియోగాన్ని పరిశీలించారు.
రోజూ తప్పనిసరిగా కొంత సమయం ట్యాబ్‌లో పాఠ్యాంశాలను చూడాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు ఐఎఫ్‌పీలు, స్మార్ట్ టీవీల్లో బోధన చేస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఈఓలు కె.రాంబాబు, జి.బాలయ్య, హెచ్‌ఎం సంకు ఏసుబాబు ఆయన వెంట ఉన్నారు.
Today Top Current Affairs: నేటి ముఖ్యమైన టాప్ 10 కరెంట్ అఫైర్స్ ఇవే!
Tags
- Digital education
- AP government
- Tabs For Students
- Byjus Tabs
- DEO Abraham
- Byjus curriculum
- technical skills
- Teachers and students
- School Education
- inspection of digital teaching
- Education News
- Sakshi Education News
- Eluru news
- DigitalEducation
- EducationalEffectiveness
- UsageMonitoring
- Teachers
- FreeTablets
- Schools
- Students
- DigitalEducation
- GovernmentInitiative