Government Schools: సర్కారు బడుల్లో ప్రవేశాలకు విద్యార్థుల ఆసక్తి.. కారణం..?
విజయవాడ పశ్చిమ: కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా సర్కార్ పాఠశాలలను తీర్చిదిద్దటంతో అందులో ప్రవేశాలకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆ దిశగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ఆయా విద్యాసంస్థల సమీప ప్రాంతాల్లో ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. ఆ క్రమంలో జిల్లాలోని పలువురు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. మనబడి మన బాధ్యతను గుర్తు చేసుకుంటూ 2024–25 విద్యా సంవత్సరం అడ్మిషన్లపై దృష్టి పెట్టారు.
World Cup 2024 Munich: ప్రపంచకప్ షూటింగ్‌లో భారత్‌కు రెండో పతకం ఇదే..
ఉన్నత పాఠశాలల సమీప ప్రాంతాలకు వెళ్లి మన బడిలోనే మీ పిల్లలను చేర్చించండి.. అంటూ తల్లిదండ్రులను కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మౌలిక సౌకర్యాలు, అందిస్తున్న విద్యాప్రమాణాలను తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో సాధించిన ఉత్తీర్ణతను, విద్యార్థులు సాధించిన మార్కులను కరపత్రాల రూపంలో ముద్రించి ఆయా ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి పంచుతున్నారు. జిల్లాలో పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ బడుల పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు.
Anganwadi Workers Retirement Benefits: ‘అంగన్‌వాడీ’ల రిటైర్మెంట్ లబ్ధిని ఇంత చేయాలి!
ఫ్లెక్సీలతో ప్రచారం..
పలు ప్రభుత్వ పాఠశాలలు వినూత్నంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు సాధించిన అద్భుత ఫలితాలను ప్రచారాస్త్రాలుగా వినియోగించుకుంటున్నాయి. పదో తరగతి ఫలితాల్లో మెరిట్ విద్యార్థుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఆయా పాఠశాలల వద్ద ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ పోటీ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన విజయాలను ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. తమ పాఠశాలలో చేరటం ద్వారా పిల్లలకు లభించే సదుపాయాలు, పుస్తకాలు, దుస్తులు, ఎనిమిదో తరగతిలో లభించే ట్యాబ్‌ల గురించి వివరించి పిల్లలను విద్యాసంస్థల్లో చేర్చాలని సూచిస్తున్నారు.
Sunita Williams: విజయవంతంగా గమ్యస్థానాన్ని చేరుకున్న సునీతా విలియమ్స్
బాధ్యతగా..
పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేలా మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు వెబెక్స్, గూగుల్ మీట్ సమావేశాల ద్వారా మార్గదర్శకత్వం చేశారు. దీంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అడ్మిషన్ల ప్రక్రియను బాధ్యతగా తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు వల వేస్తూ ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించాయి. దీనికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు స్కాలర్‌షిప్ పోటీ పరీక్షలు, ట్రిపుల్ ఐటీల్లో సాధించిన సీట్ల వివరాలను ఫ్లెక్సీల్లో పొందుపర్చారు.
Schools Re-Open: వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న అంశాలు..
● జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న ప్రీ స్కూల్స్‌లో 3–6 సంవత్సరాల వయసు ఉన్న వారు వేలాది మంది ఉన్నారు. వీరిలో ఐదేళ్లు పైబడిన వారు సైతం వేల సంఖ్యలో ఉన్నారు. ఐదు సంవత్సరాల వయసు పైబడిన పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్చించేలా ఫోకస్ పెట్టారు.
● ప్రైవేట్ కాన్వెంట్లలో యూకేజీ చదువుతున్న విద్యార్థులను సర్కార్ పాఠశాలలకు తీసుకొచ్చే దిశగా ప్రచారం చేస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో సుమారుగా 12 నుంచి 15 వేల మంది జిల్లాలో అడ్మిషన్లు పొందారు.
Artificial intelligence: ఏఐ స్కిల్‌కి క్రేజీ డిమాండ్.. రూ.లక్షల్లో జీతాలు!
● ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికే ఐదో తరగతి చదువుతున్న వారితో పాటుగా, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను కూడా చేర్చుకునేందుకు వారి తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నారు.
● ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చేవారు ఎవరైనా ఉంటే వారికి ముందస్తుగా అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు.
ప్రవేశాలపై ప్రధానోపాధ్యాయుల ఫోకస్ వేసవిలో పెద్ద ఎత్తున అడ్మిషన్లు 12న పాఠశాలల పునఃప్రారంభం
అడ్మిషన్లు బాగున్నాయి..
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తోంది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ఇటీవల పూర్తి స్థాయిలో ఏర్పాటైన మౌలిక సదుపాయాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు ఎంతో అండగా ఉంటున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపొందాయి. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఇంకా ప్రైవేట్‌పై మక్కువ చూపుతున్నారు. వారు కూడా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సహకారంతో తల్లిదండ్రులను చైతన్య పరుస్తున్నాం.
– యూవీ సుబ్బారావు, డీఈవో