Degree Results: డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదల
Sakshi Education
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ ఆరో సెమిస్టర్ (చివరి సెమిస్టర్) ఫలితాలను వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు ఆగస్టు 15న విడుదల చేశారు.
డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఈ పరీక్షలు జూన్ 27 నుంచి జూలై 11 వరకు నిర్వహించారు. మొత్తం 11,884 మంది హాజరు కాగా, 5799 మంది ఉత్తీర్ణత సాధించారు. 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలు జ్ఞానభూమి వెబ్ సైట్‌లో పొందు పర్చారు. ఫెయిల్ అయిన విద్యార్థులు రీ వాల్యుయేషన్ కోసం 15 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.