తరగతి గదిలో భావి భారత నిర్మాణం
లక్ష్మీపురం మెయిన్ రోడ్డులోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్‌ఈ స్కూల్లో నిర్వహించిన ఆగస్టు 15న నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ రామకృష్ణప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా ఆయన పాఠశాల వెలుపల ఉన్న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పాటిబండ్ల సీతారామయ్య కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజోపయోగ కార్యక్రమాలతో సామాజిక సేవా తత్పరునిగా తరించిన పాటిబండ్ల సీతారామయ్య చిరస్మరణీయులని, ఆయన్ను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా విద్యార్థులు శాసీ్త్రయ నృత్య, దేశభక్తి గీతాలాపన, తైక్వాండో, యోగా, కర్రసాము ప్రదర్శన, మతాలన్నీ ఒకటే అని చాటి చెప్పేలా ప్రదర్శించిన నృత్య రూపకం ఆకట్టుకుంది.
చదవండి: NMMS: ప్రతిభకు ప్రోత్సాహం.. ఉపకార వేతనం
కార్యక్రమంలో పాఠశాల కమిటీ గౌరవాధ్యక్షుడు డాక్టర్ యలమంచిలి శివాజీ, కరస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్, ఉపాధ్యక్షుడు డాక్టర్ సూర్యదేవర హనుమంతరావు, సభ్యులు గింజుపల్లి వరప్రసాదరావు, మాదల రాజేంద్రప్రసాద్, మదమంచి రవీంద్ర, బొల్లేపల్లి శ్రీనివాస్, చిలుకూరి నరేంద్రబాబు, డైరెక్టర్ లేళ్ల కృష్ణవేణి, ప్రిన్సిపాల్ జంపని పద్మజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.