Skip to main content

Punishment For Teachers: అయ్యబాబోయ్‌..ఉపాధ్యాయులకు ఇదేమి శిక్ష?

school teachers news  Officials explaining training requirements to teachers
school teachers news

హిందూపురం: ఆధునికత కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో విద్యా వ్యవస్థలో ఇంకా శిక్షణల పేరుతో పాతకాల పద్ధతులనే కొనసాగించడం వివాదాస్పదంగా మారింది. అందరి చేతుల్లో ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్లు, ఇళ్లలో పర్సనల్‌ కంప్యూటర్లు వాడకం సాధారణమైన ఈ రోజుల్లో కూడా ఆన్‌లైన్‌ శిక్షణలు గాలికి వదిలేసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు రెసిడెన్షియల్‌ శిక్షణ పేరుతో కూటమి సర్కార్‌ చేపట్టిన కార్యాచరణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

NMDC లో భారీగా జూనియర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు జీతం 50వేలు: Click Here

రెండు జిల్లాలకు కలిపి ఒకేచోట..

ప్రాథమిక పాఠశాలల్లో చదివే పిల్లలకు భాష, గణితంలో అభ్యాసన సామర్థ్యాలను మరింత పెంచేలా ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ పేరుతో శిక్షణ కార్యక్రమాలను చేపట్టారు. ఈ నెల 21న ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ కొనసాగనున్నాయి. హిందూపురంలోని బిట్‌ కళాశాల వేదికగా జిల్లాలోని ఉపాధ్యాయులతో పాటు నంద్యాల జిల్లాకు చెందిన వారికి రెసిడెన్షియల్‌ శిక్షణ ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో 600 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఒక్కో బ్యాచ్‌కు ఆరు రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు ఈ శిక్షణ నిబంధనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆరు రోజుల పాటు వారు సెంటర్‌ వదిలి బయటకు వెళ్లరాదంటూ అధికారులు స్పష్టం చేశారు. దీంతో పలువురు ఉపాధ్యాయులు అయ్యబాబోయ్‌... ఇదేమి శిక్ష మాకు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బడులు మూత వేసే కుట్ర..

ప్రాథమిక పాఠశాలలను మూత వేసే కుట్రలో భాగంగా వారాల కొద్దీ ఉపాధ్యాయులను శిక్షణ పేరుతో బడులకు కూటమి సర్కార్‌ దూరం చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్న పాఠశాలలు దాదాపు 60శాతం వరకు ఉన్నాయి. ఇద్దరు పనిచేసే స్కూల్‌ నుంచి ఒకరిని శిక్షణ పేరుతో నెలలో 15 రోజులు పాఠశాలకు దూరం చేస్తున్నారు. దీంతో మిగిలిన ఒక ఉపాధ్యాయుడిపై భారం పడుతోంది. విద్యా సంవత్సరానికి అతిముఖ్యమైన నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో ఇలాంటి కార్యాచరణ చేపట్టడం వెనుక పెద్ద కుట్రే దాగుందనే అనుమానాలను ఉపాధ్యాయులు సైతం వ్యక్తం చేస్తున్నారు.
 

విధి విధానాలు పాటిస్తున్నాం

ప్రాథమిక స్థాయిలో 3 నుంచి 9 సంవత్సరాల వయసున్న విద్యార్థుల్లో మనోవికాసం పెంపునకు దోహద పడేలా ఉపాధ్యాయులుకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఈపీ ప్యాట్రన్‌ ప్రకారం విద్యావిధానాలను పాటిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రాఽథమిక విద్యపై ఎక్కువ దృష్టి సారించాం.

Published date : 25 Oct 2024 10:28AM

Photo Stories