Skip to main content

ఖనిజ వనరులు

భారతదేశంలో అనేక ఖనిజవనరులు ఉన్నాయి. ఇనుము- ఉక్కు పరిశ్రమకు ప్రధాన ముడి పదార్థాలైన ఇనుపధాతువు, మాంగనీసు, భారతదేశంలో ఎక్కువగా లభిస్తాయి. దేశంలో బాక్సైట్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. బాక్సై ట్ నుంచి అల్యూమినియం తయారవుతుంది.
విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు తప్పని సరిగా అవసరమైన మైకా నిల్వలు భారతదేశం లో మాత్రమే ఉన్నాయి. శీఘ్ర పారిశ్రామికీకరణ కు మూలమైన బొగ్గు నిక్షేపాలు దేశంలో విస్తా రంగా లభిస్తున్నాయి. నేడు దేశంలో 100 ఖనిజాల కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి.
దేశంలో విస్తరించిన ముఖ్య ఖనిజ మేఖలలు
  1. దామోదర్ లోయ ప్రాంతం లేదా బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మేఖల: ఈ మేఖలలో నేలబొగ్గు, ఇనుపధాతువు, మాంగనీసు, అభ్రకం, డోలమైట్, చైనా క్లే, క్రోమైట్, ఫాస్పేట్, బాక్సైట్, రాగి, సున్న పురాయి ఎక్కువగా ఉన్నాయి.
  2. మధ్య భారతదేశం లేదా మధ్యప్రదేశ్- మహారాష్ర్ట మేఖల: మాంగనీసు, బొగ్గు, సున్నపురాయి, బాక్సైట్, ఇనుము, రాగి, క్రోమైట్ ఎక్కువగా లభిస్తు న్నాయి.
  3. ఆంధ్రప్రదేశ్‌లోని దక్కను భూ భాగం: ఈ ప్రాంతంలో ద్వితీయశ్రేణి బొగ్గు, అభ్రకం, బైరటీస్, ఆస్బెస్టాస్, డోలమైట్, సున్నపురాయి, గ్రాఫైట్, ఇనుపధాతు నిక్షేపాలు విస్తారంగా ఉంటాయి.
  4. కర్ణాటక ప్రాంతం: బంగారం, ఇనుము, క్రోమైట్, బాక్సైట్, మాంగనీసు, ఆస్బె స్టాస్, క్వార్‌‌ట ్జ, సిలికా ఎక్కువగా ఉన్నాయి.
  5. తమిళనాడు ప్రాంతం: బొగ్గు, సున్నపు రాయి, జిప్సం, మాంగనీసు, చైనా క్లే, బాక్సైట్, ఇనుప ధాతువు లభిస్తున్నాయి.
  6. కేరళ ప్రాంతం: బాక్సైట్, బంకమట్టితో కూడిన ఖనిజం, ఇను పధాతువు, గ్రాఫైట్, అభ్రకం, బంగారం, సున్నపురాయి వంటి ఖనిజాలు ఉన్నాయి.
  7. మధ్య రాజస్థాన్, గుజరాత్ మేఖలు: రాగి, సీసం, జింకు, వెండి, యురేనియం. బం గారం, డోలమైట్, మాంగనీస్, స్టియటై ట్, పాలరాయి, ఆస్బెస్టాస్, బొగ్గు, జిప్సం, విలువైన రాళ్లు ఎక్కువ.
  8. హిమాలయ ప్రాంతం: రాగి, సీసం, జింకు, ఆంటిమొని, నికెల్, కోబాల్ట్, టంగ్‌స్టన్, బంగారం, వెండి, ఇతర విలువైన రాళ్లు లభిస్తున్నాయి.
భారతదేశంలో ఖనిజాల లభ్యత ఆధా రంగా వాటిని మూడు రకాలుగావర్గీక రించవచ్చు. అవి..
  • దేశంలో ఉపయోగించినా ఎగుమతి చేయ డానికి మిగులు ఉన్న ఖనిజాలు: ఇనుప ధాతువు, అభ్రకం, మాంగనీసు, క్రోమైట్, టిటానియం, బాక్సైట్, గ్రానైట్, సిలికా, స్టియటైట్, మోనజైట్, బెరిలం, కొర్రండం, కయనైట్, సిలియనైట్, థోరియం.
  • దేశంలో స్వయంసమృద్ధికి సరిపడే ఖని జాలు: బొగ్గు, ఫెల్‌స్ఫార్, అల్యూమిని యం, స్లేట్ పాలరాయి, సున్నపురాయి, డోలమైట్, జిప్సం, బెరైటీస్, ఆంటిమొని, విలువైన రాళ్లు మొదలైనవి.
  • దేశంలో కొరతగా ఉన్నవి, ఎక్కువగా దిగు మతి చేసుకునేవి: పెట్రోలియం,
    , రాగి, సీసం, తగరం, వెండి, జింకు, నికెల్, గ్రాఫైట్, టంగ్‌స్టన్, పాదరసం, గంథకం, పొటాష్, రాక్ ఫాస్ఫేట్ మొదలైనవి.
ఖనిజాలను స్థూలంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి..
1. లోహ ఖనిజాలు
2. అలోహ ఖనిజాలు
3. ఇంధన ఖనిజాలు
4. అణు ఖనిజాలు

1. లోహ ఖనిజాలు :
ఇనుము

1992 నాటికి 54,872,000 టన్నుల ఇనుము ఉత్పత్తి జరిగింది. ప్రపంచం మొత్తం నిల్వల్లో 25 శాతం భారతదేశంలో ఉన్నాయి. ఇక్కడ లభించే ఇనుప ధాతువు మేలి రకమైంది. హెమటైట్, మాగ్నటైట్‌లు ముఖ్య ఇనుపధాతు ఖనిజాలు. దేశంలోని నిల్వల్లో సుమారు 96 శాతం ఒడిశా, బీహార్, మధ్యప్ర దేశ్, గోవా, కర్నాటకల్లో ఉన్నాయి. మన ఖనిజా న్ని జపాన్ ఎక్కువగా దిగుమతి చేసుకుం టోంది. ఇనుమును ప్రధానంగా ఉక్కు యంత్రాలు, పరికరాలు, ఆయుధాలు, అనేక ఇతర నిర్మాణాలకు ఉపయోగిస్తారు. ఇనుము ప్రధానంగా సింగ్‌భమ్ (జార్ఖండ్), మయూర్ భంజ్, కియోంజహార్, సుందర్ ఘర్(ఒడిశా), రాయ్‌పూర్, దుర్‌‌గ, బస్తర్ (ఛత్తీస్‌గఢ్) బళ్లారి, చిత్రదుర్‌‌గ, చిక్‌మగ్‌ళూర్ (కర్ణాటక), ఉత్తర గోవా (గోవా), సేలం (తమిళనాడు) ఖమ్మం (తెలంగాణ), రాయలసీమ జిల్లాలు (ఆంధ్ర ప్రదేశ్), రత్నగిరి, చాందా జిల్లాలు (మహా రాష్ర్ట) మొదలైన ప్రాంతాలలో లభిస్తుంది.
మాంగనీసు
1992 నాటికి 1,810,000 టన్నుల మాంగనీసు ఉత్పత్తి జరిగింది. ఎక్కువ గా ఉత్పత్తి చేస్తున్న ప్రపంచ దేశాల్లో భారత దేశం మూడోది. దేశ ఉత్పత్తిలో 25శాతం ఎగు మతి అవుతుంది. విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జిం చి పెడుతోంది. జపాన్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఒడిశా, కర్ణాటకలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. మాంగనీసును ముఖ్యంగా ఉక్కు, దాని మిశ్రమధాతువుల ఉత్పత్తిలో, రసా యన పరిశ్రమలలో, బ్లీచింగ్ పౌడరు, నల్ల ఎనా మిల్ తయారీకి, ఎలక్ట్రికల్, గాజు, తోళ్లు, లోహ పరిశ్రమలు, ఫొటోగ్రఫీలో ఉపయోగిస్తారు.

లభించే ప్రాంతాలు: ఒడిశా- కలహాండి, కోరాపుట్, మయూర్‌భంజ్. కర్ణాటక - చిత్ర దుర్‌‌గ, తుమ్కూరు, షిమోగా, చిక్‌మగ్‌ళూరు, బెల్గాం, బళ్లారి, ధార్వాడ్.మధ్యప్రదేశ్ - బాలా ఘాట్, సియోరి, చింద్వారా, జబల్‌పూర్, జాబు వా. మహారాష్ర్ట - నాగ్‌పూర్, భండారా, రత్న గిరి. జార్ఖండ్ - సింగ్‌భమ్.
గుజరాత్ - పంచమహల్.
రాజస్థాన్ - భానేశ్వర, ఉదయపూర్.
ఆంధ్రప్రదేశ్ - శ్రీకాకుళం, విశాఖపట్టణం.
గోవా - పేర్నెం, బార్నెర్.
బాక్సైట్
దేశంలో 1992 నాటికి 4,898,000 టన్నుల బాక్సైట్‌ను ఉత్పత్తి చేశారు. భారతదేశం కొద్ది పరిమాణంలో విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. మనదేశం నుంచి బాక్సైట్‌ను దిగు మతి చేసుకుంటున్న దేశాల్లో ఇటలీ, యునెటైడ్ కింగ్‌డమ్‌లు ముఖ్యమైనవి. బీహార్, గుజరా త్‌లు ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్నాయి. బాక్సైట్ నుంచి అల్యూమినియం ఉత్పత్తి అవుతుంది. విమానాలు, ఆటోమొబైల్స్, ఓడలు, పాత్రలు, రైలుమార్గాలు, ఫొటోగ్రఫీకి సంబంధించిన పరి కరాలు, విద్యుత్, నిర్మాణవస్తువుల తయారీలో అల్యూమినియంను ఉపయోగిస్తారు.
బాక్సైట్ ప్రధానంగా లభించే రాష్ట్రాలు
జార్ఖండ్ -
పల్మావు, రాంచీ, మాంఘిర్, షహనాబాద్.
జరాత్ - ఆమ్రేలి, జామ్‌నగర్, కైరా, కచ్.
మధ్యప్రదేశ్ - బాలాఘాట్, జబల్‌పూర్.
ఛత్తీస్‌గఢ్ -బిలాస్‌పూర్, రాయ్‌గర్, సుర్‌గజ.
మహారాష్ర్ట - కోషాపూర్, కొలాబా, థానా, సతారా, రత్నగిరి.
కర్నాటక -బెల్గాం.
తమిళనాడు - మధుైరె , నీలగిరి, కోయంబత్తూర్
ఒడిశా - కలహండి, కోరాపుట్.
ఆంధ్రప్రదేశ్ - విశాఖపట్నం.
ఉత్తరప్రదేశ్ - బండా, అలహాబాద్.
రాగి
1992 నాటికి 5,357,000 టన్నుల రాగిని ఉత్పత్తి చేశారు. దేశంలో రాగి ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. కాబట్టి దిగుమతులపై ఎక్కు వగా ఆధారపడుతున్నారు. రాగిని బీహార్ అధి కంగా ఉత్పత్తి చేస్తోంది. ఎలక్ట్రికల్ పరిశ్రమల్లో, ఇత్తడి నాణేలు, పాత్రల తయారీకి రాగినిఉప యోగిస్తారు.
రాగి ప్రధానంగా లభించే ప్రాంతాలు
జార్ఖండ్-
సింగ్‌భమ్, హజారీబాగ్.
రాజస్థాన్ - ఆల్వార్, జైపూర్, జాల్‌వార్, ఝం ఝూర్.
ఆంధ్రప్రదేశ్ - గుంటూరు, కర్నూలు.
మధ్యప్రదేశ్ - బాలాఘాట్.
తమిళనాడు -దక్షిణ అర్కాట్.
కర్ణాటక - హసన్.
హిమాచల్‌ప్రదేశ్ - కాంగ్రా.
ఉత్తరాఖండ్ - అల్మోరా.
సీసం, జింకు
1992 నాటికి 59,675 టన్నుల సీసం, 300,000 టన్నుల జింకును ఉత్పత్తి చేశారు. ఇవి స్ఫటికా కృతి షిస్ట్స్‌తో కలిసి ఉంటాయి. వీటిని రాజస్థాన్ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. వీటి ఉత్పత్తి దేశం లో తక్కువగా ఉన్నందున ఆస్ట్రేలియా, కెనడాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. జింకును రాగితో కలిపి ఇత్తడి తయారుచేస్తారు. స్టోరేజి బ్యాటరీలు, రంగులు, తుపాకీ గుళ్లు, గ్యాసోలి న్ తయారీకి సీసం ఉపయోగిస్తున్నారు.
సీసం, జింకు ప్రధానంగా లభించే ప్రదేశాలు
రాజస్థాన్ -
ఉదయ్‌పూర్, అజ్మీర్, ఆల్వార్.
ఆంధ్రప్రదేశ్ - కడప.
జార్ఖండ్ - భగల్‌పూర్, హజారీబాగ్, సంతల్ పరగణాలు.
ఉత్తరాఖండ్ - అల్మోరా.
క్రోమైట్
1992 నాటికి 1,152,000 టన్నుల క్రోమైట్‌ను ఉత్పత్తి చేశారు. ఒడిశాలో అత్యధికంగా లభి స్తోంది. జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు ఎక్కువ గా ఎగుమతి చేస్తున్నారు. క్రోమైట్‌ను లోహ శు ద్ధి, రిఫ్రాక్టరీ, రసాయన పరిశ్రమల్లో విస్తారంగా ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకమైన ఉక్కు, స్టెయి న్‌లెస్ స్టీలు తయారీలో కూడా వినియోగిస్తారు.
క్రోమైట్ ప్రధానంగా లభించే ప్రాంతాలు
ఒడిశా - కటక్, కియోంజహార్.
కర్నాటక - హసన్, మైసూరు, చిత్రదుర్‌‌గ, చిక్‌మగళూరు.
మహారాష్ర్ట - భండారా, రత్నగిరి.
జార్ఖండ్ - సింగ్‌భమ్.
ఆంధ్రప్రదేశ్ - కృష్ణా జిల్లా. తెలంగాణ: ఖమ్మం.
బంగారం
1992 నాటికి 1,762 కిలోల బంగారం ఉత్పత్తి
అయింది. దేశంలో ఈ నిక్షేపాలు చాలా తక్కువగా ఉన్నాయి. కర్నాటక అత్యధికంగా ఉత్పత్తి చేస్తోంది. అలంకరణ సామగ్రి, ఆభరణాలు, దంతాలు, పళ్లు కట్టడంలోనూ, నాణేలకు ఎక్కువగా వినియోగిస్తారు.
బంగారం ప్రధానంగా లభించే ప్రాంతాలు
కర్నాటక -
కోలార్, మైసూరు, రాయచూరు.
ఆంధ్రప్రదేశ్ - అనంతపురం.
తమిళనాడు - కోయంబత్తూర్, నీలగిరులు.
కేరళ- కోజికోడ్.
జార్ఖండ్ - సింగ్‌భమ్.
వెండి
1992 నాటికి 47,371 కిలోల వెండిని ఉత్పత్తి చేశారు. వెండిని రాజస్థాన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. ఇటీవలి కాలంలో విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. దీనిని అలంకరణ వస్తువులు, పాత్రలు, రసాయనాల తయారీకి ఉప యోగిస్తారు. వెండి ప్రధానంగా ఉదయపూర్ (రాజస్థాన్) కోలార్, చిత్రదుర్‌‌గ (కర్నాటక) కడప, గుంటూరు, కర్నూలు (ఆంధ్రప్రదేశ్) మొదలైన ప్రాంతాలలో లభిస్తోంది.
టంగ్‌స్టన్
1992 నాటికి 4,569 కిలోల టంగ్‌స్టన్‌ను ఉత్పత్తి చేశారు. దీన్ని అయో మిశ్ర లోహాలు, కఠినమైన కోత పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. రంగులు, పింగాణీ, వస్త్రాలు, విద్యుత్ బల్బుల ఫిలమెంట్ల తయారీలో కూడా వాడతారు. టంగ్ స్టన్ ప్రధానంగా రేవంత్‌కొండ (రాజస్థాన్), నాగపూర్ (మహారాష్ర్ట), పొర పహార్ కొండ (పశ్చిమ బెంగాల్)ల్లో లభిస్తోంది.
తగరం
1992 నాటికి 74,524 కిలోలు ఉత్పత్తి చేశారు. దేశంలో తగరం ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. మలేషియా, సింగపూర్‌ల నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటోంది. ఎలక్ట్రికల్ వస్తు వులు, మందుల పరిశ్రమల్లో తగరం ఉప యోగపడుతుంది. తగరం ప్రధానంగా గయ (బీహార్), హజారీబాగ్, రాంచీ (జార్ఖండ్)లలో లభిస్తోంది.

అలోహ ఖనిజాలు
అభ్రకం: 1992 నాటికి 2,737 టన్నుల అభ్రకం ఉత్పత్తి అయింది. అభ్రకం ఉత్పత్తి, ఎగుమతు ల్లో భారతదేశం ప్రపంచంలో ప్రథమస్థానంలో ఉంది. బీహార్, ఆంధ్రప్రదేశ్ ఎక్కువగాఉత్పత్తి చేస్తున్నాయి. విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో అభ్రకంను ఉపయోగిస్తారు. ప్రధానంగా హజా రీబాగ్, మాంఘిర్ (జార్ఖండ్), గయ (బీహార్), నెల్లూరు (ఆంధ్రప్రదేశ్), జైపూర్, భిల్వార్, ఉదయపూర్ (రాజస్థాన్)ల్లో లభిస్తోంది.
సున్నపురాయి
1992 నాటికి 75,538,000 టన్నుల సున్నపు రాయిని ఉత్పత్తి చేశారు. మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, రాజస్థాన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నా యి. సిమెంటు, ఇనుము- ఉక్కు, రసాయ నాలు, పంచదార, కాగితం, ఎరువులు వంటి అనేక పరిశ్రమల్లో సున్నపురాయిని ఉపయో గిస్తారు.
సున్నపురాయి ప్రధానంగా లభించే ప్రాంతాలు
ఆంధ్రప్రదేశ్ - కడప, కర్నూలు, గుంటూరు.
తెలంగాణ:ఖమ్మం, నల్గొండ.
కర్నాటక - గుల్బర్గా, బీజాపూర్, చిత్రదుర్‌‌గ, తుముకూరు, షిమోగా.
గుజరాత్ - ఆమ్రేలి, కచ్, బాణాస్కాంతా, సూరత్.
రాజస్థాన్ - అజ్మీర్, జోధ్‌పూర్, పాలి, బుండి.
ఛత్తీస్‌గఢ్- బిలాస్‌పూర్, రాయ్‌పూర్.
మధ్యప్రదేశ్ - జబల్‌పూర్, రేవా, సాత్నా.
తమిళనాడు - రామనాథపురం, తిరునల్వేలి, సే లం, కోయంబత్తూరు, మధురై.
జిప్సం
1992 నాటికి 1,183,000 టన్నుల ఉత్పత్తి జరిగింది. జిప్సంను రాజస్థాన్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తోంది. సిమెంటు, ఎరువుల పరిశ్రమ ల్లో జిప్సంను అధికంగా ఉపయోగిస్తారు. జి ప్సం ప్రధానంగా రాజస్థాన్‌లోని నాగపూర్, బి కనీర్, గంగానగర్, భరత్‌పూర్, చురు, జైసల్మీర్, బార్మెర్, పాలి, జోధ్‌పూర్‌ల్లో లభిస్తోంది.
ఎపటైట్
1992 నాటికి 16,609 టన్నుల ఎపటైట్‌ను ఉత్పత్తి చేశారు. ఎపటైట్ ఉత్పత్తి మనదేశంలో అతి తక్కువగా ఉంది. జోర్డాన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునెటైడ్ అరబ్ రిపబ్లిక్ నుంచి దిగుమతి అవుతోంది. దీన్ని ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. ఎపటైట్ ప్రధానంగా జార్ఖండ్‌లో సింగ్‌భమ్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, వైజాగ్‌లో లభిస్తుంది.
బెరైటీస్
1992 నాటికి 5,08,000 టన్నుల బెరైటీస్ ఉత్పత్తి అయింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. ఎక్కువగా ఎగుమతి చేస్తున్న రాష్ట్రం కూడా ఇదే. రంగులు, కాగితం, వస్త్రాలు, తోళ్ల పరిశ్రమల్లో దీన్ని ఉపయోగిస్తారు. బెరైటీస్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురం, కర్నూలు, ఖమ్మం, కృష్ణా జిల్లాలు, రాజస్థాన్‌లోని ఆల్వార్ ప్రాంతాల్లో లభిస్తోంది.
అస్బెస్టాస్
1992 నాటికి 42,887 టన్నులు ఉత్పత్తి చేశారు. అస్బెస్టాస్‌ను కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. దీన్ని పైపులు, పెంకులు, పలకల లాంటి అస్బెస్టాస్ సిమెంటు ఉత్పత్తులు, క్రూడ్ బాయిలర్ లాగింగ్‌‌స థర్మల్ ఇన్సులేషన్ కవరింగులు తదితరాలకు ఉపయోగిస్తారు.
అస్బెస్టాస్‌ను ప్రధానంగా సింగ్‌భమ్, పరూలియా (జార్ఖండ్) హసన్, మాండ్యా, షిమోగా, చిక్‌మగళూరు (కర్ణాటక), ఆజ్మీర్, భిల్‌వారా, పాలి, ఆల్వార్, ఉదయపూర్ (రాజస్థాన్), కడప, మహబూబ్‌నగర్ జిల్లాల్లో లభిస్తుంది.
గ్రాఫైట్
1992 నాటికి 70,438 టన్నుల గ్రాఫైట్‌ను ఉత్పత్తి చేశారు. దీన్ని ఫ్రౌండీలు, అణురియాక్టర్లలో ఉపయోగిస్తారు. గ్రాఫైట్ క్రూసిబుల్స్, సీసం పెన్సిళ్లు, లూబ్రికెంట్లు, రంగులు తయారీలోనూ ఉపయోగిస్తారు.
గ్రాఫైట్ ప్రధానంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం, కృష్ణా జిల్లాలు (ఆంధ్రప్రదేశ్), కలహండి, బోలంగిర్, సంబల్ పూర్, కోరాపుట్ (ఒడిశా) కోలార్ జిల్లా (కర్ణాటక) మొదలైన ప్రాంతాల్లో లభిస్తుంది.
కయనైట్
1992 నాటికి 9,182 టన్నుల కయనైట్ ఉత్పత్తి అయింది. కయనైట్‌ను బీహార్, మహారాష్ట్ర అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఎగుమతి కూడా చేస్తున్నారు. జపాన్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. దీన్ని పింగాణీ, రిఫ్రాక్టరీ, మెటలర్జికల్, ఎలక్ట్ట్రికల్, సిమెంటు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. కయనైట్‌ను ప్రధానంగా జార్ఖండ్‌లో సింగ్‌భమ్, మహారాష్ట్రలో భండారా, కర్ణాటకలో హసన్ జిల్లాల్లో లభిస్తోంది.
మాగ్నసైట్
1992 నాటికి 9,182 టన్నుల మాగ్నసైట్ ఉత్పత్తి అయింది. దీన్ని తమిళనాడు అత్యధికంగా ఉత్పత్తి చేస్తోంది. మాగ్నసైట్‌ను ఇనుము- ఉక్కు పరిశ్రమలో రిఫ్రాక్టరీ పదార్థంగా ఉపయోగిస్తారు. ఇది ప్రధానంగా తమిళనాడులో సేలం, ఉత్తరాఖండ్‌లో ఆల్మోరా జిల్లాల్లో లభిస్తోంది.
సిల్లిమనైట్
1992 నాటికి 16,634 టన్నులు సిల్లిమనైట్ ఉత్పత్తి జరిగింది. దీన్ని మహారాష్ట్ర, మేఘాలయ అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. జపాన్, జర్మనీకి ఎగుమతి చేస్తున్నారు. దీన్ని విద్యుత్ పోర్సిలిన్, స్పార్కు ప్లగ్‌ల తయారీలో ఉపయోగిస్తారు. ఇది ప్రధానంగా నొంగటోయిన్ ప్రాంతం (మేఘాలయ), రేవా జిల్లా (మధ్యప్రదేశ్), భండారా, నాగపూర్ (మహారాష్ట్ర), కోజికోడ్ (కేరళ) మొదలైన ప్రాంతాల్లో లభిస్తోంది.
స్టియటైట్
1992 నాటికి 3,74,000 టన్నుల స్టియటైట్‌ను ఉత్పత్తి చేశారు. రాజస్థాన్‌లో అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. దీన్ని జపాన్, యునెటైడ్ కింగ్‌డమ్, నార్వే దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అలంకరణ సామగ్రి, పింగాణీ, రంగుల కాగితం, సబ్బులు మొదలైన వాటి తయారీలో స్టియటైట్‌ను ఉపయోగిస్తారు. ఇవి ప్రధానంగా భిల్వారా, ఉదయ్‌పూర్, జయపూర్ (రాజస్థాన్) రాయలసీమ జిల్లాల్లో (ఆంధ్రప్రదేశ్) లభిస్తోంది.
డోలమైట్
1992 నాటికి 2,91,400 టన్నుల డోలమైట్ ఉత్పత్తి అయింది. దీన్ని ఒడిశా అత్యధికంగా ఉత్పత్తి చేస్తోంది. మెటలర్జికల్, రిఫ్రాక్టరీ పరిశ్రమల్లో డోలమైట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ప్రధానంగా ఒడిశాలో సుందర్‌నగర్, సంబల్‌పూర్, ఛత్తీస్ గఢ్‌లో బిలాస్‌పూర్ ప్రాంతాల్లో లభిస్తోంది.
వజ్రాలు
1992 నాటికి 17,892 టన్నుల వజ్రాల ఉత్పత్తి జరిగింది. ఇవి మధ్యప్రదేశ్‌లో అధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. వజ్రాలు ప్రధానంగా పన్నా, ఛత్తర్‌పూర్, సాత్నా (మధ్యప్రదేశ్), భండారా (మహారాష్ట్ర), అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్) ప్రాంతాల్లో లభిస్తున్నాయి.
ఉప్పు
1992 నాటికి 30,66,000 టన్నుల ఉప్పును ఉత్పత్తి చేశారు. దీన్ని ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీన్ని ఆహారంలో, పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ఇది ప్రధానంగా ద్వీపకల్పంలోని కోస్తా ప్రాంతాలు ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర తీరాలు, రాజస్థాన్‌లో సాంబార్ సరస్సు, హిమాచల్‌ప్రదేశ్‌లో మండీ ప్రాంతాల్లో లభిస్తోంది.
 
ఇంధన ఖనిజాలు
నేలబొగ్గు
1992 నాటికి 239 మిలియన్ టన్నుల నేలబొగ్గును ఉత్పత్తి చేశారు. దీన్ని బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. భారతదేశం కొద్దిగా దిగుమతి చేసుకుంటోంది. విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే ముఖ్య ఖనిజాల్లో నేల బొగ్గు ఒకటి. దేశంలోని మొత్తం శక్తి వినియోగంలో 67 శాతం బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతోంది. రైళ్లు, ఇనుము-ఉక్కు తయారీకి, విద్యుదుత్పాదనకు, ఇంధనంగా ఉపయోగపడుతోంది.
నేలబొగ్గు ప్రధానంగా దిగువ గోండ్వానా, టెర్షియరీ శిలా స్వరూపాల్లో లభిస్తుంది. ముఖ్యమైన బొగ్గు క్షేత్రాలు.. ఝరియా, చంద్రపురా, బొకారో, గిరిధి (జార్ఖండ్), రాణిగంజ్, అసన్‌సోల్ (పశ్చిమ బెంగాల్), సింగ్రౌలి, కోర్బా (మధ్యప్రదేశ్), సింగరేణి (ఆంధ్రప్రదేశ్), తాల్చేరు, రాంపూర్, హిమ్గిర్ (ఒడిశా) చాందా (మహారాష్ట్ర) ప్రాంతాల్లో లభిస్తోంది.
లిగ్నైట్
1992 నాటికి 16 మిలియన్ టన్నుల లిగ్నైట్ ఉత్పత్తి జరిగింది. దీన్ని తమిళనాడు ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. ఇది దిగువశ్రేణి తక్కువరకం బొగ్గు. దీనిలో తేమ ఎక్కువగా ఉంటుంది. విద్యుదుత్పత్తికి, ఇంధనంగా ఉపయోగపడుతుంది. లిగ్నైట్‌కు తమిళనాడులోని నైవేలీ క్షేత్రం ప్రసిద్ధి.
పెట్రోలియం
1992 నాటికి 28 మిలియన్ టన్నుల పెట్రోలియంను ఉత్పత్తి చేశారు. భారతదేశ దిగుమతుల్లో పెట్రోలియం, పెట్రోలియం ఉత్పత్తులదే అధిక భాగం. రవాణా రంగంలో, వివిధ పెట్రో రసాయనాల ఉత్పత్తుల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు.
పెట్రోలియం ప్రధానంగా దిగ్భాయ్, హుగ్రీజన్, మోరన్, నహర్ కటియా, సిబ్ సాగర్, రుద్రసాగర్, చారద్‌పూర్ (అసోం), బాంబేహై (మహారాష్ట్ర), అంకలేశ్వర్, కోసంబా, కలోల్, మహేశనా, నవగామ్, థోల్కా (గుజరాత్), కృష్ణా, గోదావరి (ఆంధ్రప్రదేశ్) ప్రాంతాల్లో లభిస్తోంది.
సహజవాయువు
1992 నాటికి 13,465 మిలియన్ ఘనపు మీటర్ల సహజవాయువును ఉత్పత్తి చేశారు. విద్యుచ్ఛక్తి, ఎరువులు లాంటి ప్రధాన పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది ప్రధానంగా గుజరాత్‌లో కాంబె, అంకలేశ్వర్ క్షేత్రాలు, మహారాష్ట్రలో బాంబేహై ప్రాంతాల్లో లభిస్తోంది.

అణుశక్తి ఖనిజాలు
యురేనియం
దీన్ని అణువిద్యుదుత్పా దనకు ఉపయోగిస్తున్నారు. ఇది ప్రధానంగా గయ, సింగ్‌భమ్ (జార్ఖండ్), ఆజ్మీర్, ఉదయ్ పూర్ (రాజస్థాన్), పాల్ఘాట్, క్విలన్ జిల్లాలు (కేరళ) మొదలైన ప్రాంతాల్లో లభిస్తోంది.
థోరియం
దీన్ని అణు విద్యుదుత్పాదనకు ఉపయోగిస్తారు. ఇది తమిళనాడులో మధురై, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా జిల్లాలు, కేరళలో పాల్ఘాట్, క్విలన్, జార్ఖండ్‌లో హజరీబాగ్, రాజస్థాన్‌లో బిల్వార్ జిల్లాల్లో లభిస్తుంది.
మోనజైట్
ఇది థోరియం, యురేనియం, సిరియం, లాంథనంల సమ్మేళనం. ప్రపంచం లోనే అత్యధిక నిల్వలు భారతదేశంలో ఉన్నా యి. దీన్ని జ్వలించే గ్యాస్ మాంటిల్స్, రేడియో ట్యూబులు, పైరోఫోరిక్ మిశ్రలోహాల తయారీలో వాడుతున్నారు. ప్రధానంగా కన్యాకుమారి, క్విలన్ మధ్యప్రాంతం, తూర్పు తీరాల్లో మోనజైట్ ఇసుక నిక్షేపాలున్నాయి.

గతంలో అడిగిన ప్రశ్నలు
1.భారతదేశం నుంచి ఇనుపఖనిజాన్ని_____ దేశం ఎక్కువగా దిగుమతి చేసుకొంటుంది?(2006)
1) జర్మనీ
2) రష్యా
3) జపాన్
4) అమెరికా
2. ____ ఇసుక నిక్షేపాలలో థోరియం, యురేనియం నిక్షేపాలున్నాయి.(2008)
1) కేరళ తీరంలో
2) ఒడిశా తీరంలో
3) మహారాష్ర్ట తీరంలో
4) గోవా తీరంలో
సమాధానాలు: 1) 3 2) 1.

మాదిరి ప్రశ్నలు
1.ఇనుము, ఉక్కు పరిశ్రమకు అవసరమైన ప్రధాన ముడి పదార్థాలు?
1) మైకా
2) బాక్సైట్
3) మోనజైట్, వేకలైట్
4) ఇనుపధాతువు, మాంగనీసు
2.కిందివాటిలో దిగుమతి చేసుకొనే ఖనిజం?
1) అభ్రకం
2) బొగ్గు
3) రాగి
4) బాక్సైట్
3.గుజరాత్, అసోం రాష్ట్రాల్లోని అవక్షేపాలతో కూడిన హరివాణాల్లో లభ్యమయ్యే ఖనిజం?
1) బాక్సైట్
2) క్రోమైట్
3) బొగ్గు
4) పెట్రోలియం
4.బంగారం ఉత్పత్తిలో మొదటిస్థానంలో ఉన్న రాష్ర్టం?
1) ఆంధ్రప్రదేశ్
2) కర్నాటక
3) మధ్యప్రదేశ్
4) తమిళనాడు
5.ఇనుప ఖనిజానికి ప్రసిద్ధి చెందిన మయూర్‌భంజ్, కియోంజహార్ సుందర్‌ఘర్‌లు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?
1) ఒడిశా
2) మహారాష్ర్ట
3) ఆంధ్రప్రదేశ్
4) మధ్యప్రదేశ్
6.{పపంచంలో మాంగనీస్ ఉత్పత్తిలో భారతదేశ స్థానం?
1) మొదటి
2) రెండో
3) మూడో
4) నాలుగో
7.ఆంధ్రప్రదేశ్‌లో బాక్సైట్ ఖనిజం లభించే జిల్లా?
1) కడప
2) తూర్పుగోదావరి
3) ఖమ్మం
4) విశాఖపట్నం
8.కర్ణాటకలోని కోలార్ గనులు ఏ ఖనిజానికి ప్రసిద్ధి చెందాయి?
1) ఇనుము
2) రాగి
3) బంగారం
4) వెండి
9.ఖేత్రి గనుల్లో లభించే ఖనిజం?
1) మైకా
2) క్రోమైట్
3) రాగి
4) జింక్
10.ఏ రాష్ర్టం ఉప్పు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది?
1) మహారాష్ర్ట
2) గుజరాత్
3) కేరళ
4) పశ్చిమ బెంగాల్
11.మధ్యప్రదేశ్‌లోని పన్నా దేనికి ప్రసిద్ధి?
1) వజ్రాలు
2) బంగారం
3) కయనైట్
4) థోరియం
12.బీహార్‌లోని ఝరియా దేనికి ప్రసిద్ధి?
1) లిగ్నైట్
2) పెట్రోలియం
3) నేల బొగ్గు
4) యురేనియం
13.గుజరాత్‌లోని అంకలేశ్వర్ దేనికి ప్రసిద్ధి?
1) ఉప్పు
2) బొగ్గు
3) పెట్రోలియం
4) కయనైట్
14.థోరియం నిల్వలు అత్యధికంగా గల రాష్ర్టం?
1) బీహార్
2) రాజస్థాన్
3) ఒడిశా
4) మహారాష్ర్ట
15. మనదేశంలో దేని ఉత్పత్తి తక్కువగా ఉంది?
1) ఎపటైట్
2) మైకా
3) మాంగనీస్
4) బొగ్గు
16. దేన్ని ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు?
1 ) బంగారం
2) ఇనుము
3) రాగి
4) ఎపటైట్
17. ఎపటైట్ ఆంధ్రప్రదే శ్‌లో ఏ జిల్లాలో లభిస్తుంది?
1) గుంటూరు
2) విశాఖపట్నం
3) కృష్ణా జిల్లా
4) నెల్లూరు
18. ఏ ఖనిజాన్ని ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఎగుమతి చేస్తోంది?
1) బెరైటీస్
2) బంగారం
3) వెండి
4) రాగి
19. రంగులు, కాగితం తయారీలో ఉపయోగించే ఖనిజం?
1) ఇనుము
2) బొగ్గు
3) నికెల్
4) బెరైటీస్
20. పైపులు, పెంకుల తయారీలో దేన్ని ఉపయోగిస్తారు?
1) ఆస్బెస్టాస్
2) ఇనుము
3) బంగారం
4) రాగి
21. లూబ్రికెంట్లు, పెన్సిళ్లు, అణు రియాక్టర్లలో ఉపయోగించే ఖనిజం?
1) గ్రాఫైట్
2) బంగారం
3) వెండి
4) రాగి
22. కయనైట్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు?
1) బీహార్, మహారాష్ట్ర
2) ఒడిశా
3) ఆంధ్రప్రదేశ్
4) తమిళనాడు
23. తమిళనాడు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ఖనిజం?
1) మాగ్నసైట్
2) బంగారం
3) బొగ్గు
4) మైకా
24. విద్యుత్ పోర్సిలిన్లు, స్పార్కుప్లగ్‌ల తయారీలో ఉపయోగించే ఖనిజం?
1) సిల్లిమనైట్
2) వెండి
3) బొగ్గు
4) మైకా
సమాధానాలు
1) 4 2) 3 3) 4 4) 2 5) 1 6) 3 7) 4 8) 3 9) 3 10) 2 11) 1 12) 3
13) 3 14) 1 15) 1 16) 4 17) 2 18) 1 19) 4 20) 1 21)1 22) 1 23) 1 24) 1
Published date : 09 Dec 2014 04:04PM

Photo Stories