Skip to main content

ఫలవంతమైన బోధనా ప్రణాళిక

  1. బోధన ఎలా ఉండాలి, ఏ అంశాలు ఏ విధంగా బోధించాలి లాంటి విషయాల గురించి ఉపాధ్యాయుడు దేన్ని తయారు చేసుకోవాలి?
    1) బ్లూ ప్రింట్
    2) పాఠ్య పథకం
    3) మూల్యాంకనం
    4) టీచర్స్‌ డైరీ
  2. విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఉపాధ్యాయుడు బోధించే తరగతికి లక్ష్యసాధన దిశగా తయారు చేసుకునేది?
    1) వార్షిక పథకం
    2) యూనిట్ పథకం
    3) వార్షిక పరీక్షలు
    4) బ్లూ ప్రింట్
  3. ఉపాధ్యాయుడు తాను తీసుకోబోయే సెలవులను కూడా పరిగణనలోకి తీసుకొని కిందివాటిలో దేన్ని రూపొందించుకోవాలి?
    1) వార్షిక పథకం
    2) యూనిట్ పథకం
    3) వార్షిక పరీక్షలు
    4) బ్లూ ప్రింట్
  4. వార్షిక పథకం వల్ల కలిగే ఒక ప్రయోజనం?
    1) సెలవులను వాడుకోవచ్చు
    2) సమయాన్ని ఇష్టానుసారంగా వాడుకోవచ్చు
    3) రుతువులను, సహజ వనరులను ఉపయోగించి బోధించవచ్చు
    4) బోధన కష్టతరంగా పూర్తి చేయవచ్చు
  5. ఒక కేంద్రీయ ఇతివృత్తం లేదా ప్రయోజనం చుట్టూ వ్యవస్థీకరించిన కృత్యాలు, అనుభవాల అభ్యసనానికి తోడ్పడే పాఠ్య విషయ భాగం?
    1) పాఠ్య పుస్తకం
    2) పాఠ్య ప్రణాళిక
    3) యూనిట్
    4) సబ్జెక్ట్
  6. పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన సబ్జెక్ట్ విషయాన్ని యూనిట్ లేదా ప్రమాణం అంటారని తెలిపినవారు?
    1) వెస్టవే
    2) కిల్‌ప్యాట్రిక్
    3) బ్లూమ్స్
    4) ప్రెస్టన్
  7. బోధనా యూనిట్‌లో విషయం, పద్ధతి రెండూ ఉంటాయని తెలిపిందెవరు?
    1) థర్బర్, కొల్లెట్
    2) ప్రెస్టన్
    3) వెస్టవే
    4) థామన్
  8. మంచి యూనిట్ లక్షణాల్లో లేనిది?
    1) కృత్య అనుభవం
    2) త్వరగా పూర్తి చేసేది
    3) భవిష్యత్ అవసరాలు
    4) నిత్యజీవితంలో సంబంధం
  9. యూనిట్ భావనలో సమగ్రమైన విషయ భావంలో ఏ సూత్రాన్ని కలిగి ఉండాలి?
    1) బహు సందేశ సూత్రం
    2) ద్వి సందేశ సూత్రం
    3) ఏక సందేశ సూత్రం
    4) పైవేవీకాదు
  10. యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు ఎవరిని సంప్రదించాలి?
    1) ప్రధానోపాధ్యాయుడు
    2) అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు
    3) జిల్లా విద్యాశాఖాధికారి
    4) తెలివి కలిగిన విద్యార్థి
  11. విద్యార్థి సాధనను కొలవవచ్చు అని తెలియజేసిన వారెవరు?
    1) బ్లూమ్స్
    2) జాన్ డ్యూయి
    3) ప్రెస్టన్
    4) గ్లేసెస్
  12. యూనిట్ దశల్లో ప్రేరణ కలిగించడం ఏ దశకు సంబంధించింది?
    1) సంగ్రహపరచడం
    2) పునఃశ్చరణ
    3) ప్రారంభక సోపానం
    4) అభివృద్ధి పరిచే సోపానం
  13. యూనిట్ పథకం అమలు దశల్లో మూల్యాంకన పద్ధతులు ఉండే సోపానం?
    1) అభివృద్ధి పరిచే సోపానం
    2) ఉప సంహారక సోపానం
    3) ప్రారంభక సోపానం
    4) సంగ్రహపరచడం
  14. యూనిట్ పథకం వల్ల కలిగే ప్రయోజనం:
    1) విద్యార్థి కేంద్రీకృతం
    2) బోధనతో పరీక్షలకు తయారీ
    3) విద్యార్థులు స్థబ్దతతో ఉన్నా బోధించవచ్చు
    4) పైవన్నీ
  15. ఉపాధ్యాయుడు పనిచేసే తత్వం, విద్యార్థుల గురించి అతనికున్న సమాచారం, విద్యా లక్ష్యాలపై అతనికి ఉన్న అవగాహన, బోధించాల్సిన విషయం గురించి జ్ఞానం, ఫలితమైన పద్ధతులను ఉపయోగించడంలో అతని సామర్థ్యం ‘పాఠ్యపథకం’లో ఉంటాయని తెలిపిన వారెవరు?
    1) థర్బర్
    2) గ్లేసెస్
    3) ప్రెస్టెస్
    4) లెస్టర్ బి. పెండ్స్‌
  16. సమీప భవిష్యత్తులో ఉపాధ్యాయుడు బోధించబోయే చర్య కోసం రూపొందించిన పథకం?
    1) వార్షిక పథకం
    2) యూనిట్ పథకం
    3) పాఠ్య పథకం
    4) ఏదీకాదు
  17. కిందివాటిలో ఉత్తమ పాఠ్య పథకానికి ఉండాల్సిన లక్షణం కానిది?
    1) లక్ష్యాలను స్పష్టంగా చూపాలి
    2) ఉపాధ్యాయునికి సులభతరంగా ఉండాలి
    3) మూల్యాంక సాధనలను పొందుపరచాలి
    4) బోధనా కృత్యాలను సూచించాలి
  18. హెర్బార్షియన్ విధానంలో బోధనా ప్రమాణ కృత్యాలను ఎన్ని దశలుగా రూపొందించారు?
    1) 4
    2) 3
    3) 5
    4) 2
  19. ఉపాధ్యాయుడు విషయాన్ని హాజరు పరచడం అనే ప్రక్రియకు ప్రాధాన్యం ఇచ్చిన విధానం?
    1) బ్లూమ్స్ మూల్యాంకన విధానం
    2) హెర్బార్షియన్ విధానం
    3) RCEM విధానం
    4) పైవన్నీ
  20. అప్రిసెప్టల్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్‌పై ఆధారపడి క్లాసికల్ హ్యుమన్ ఆర్గనైజేషన్ థియరీ ప్రభావం కలిగిన విధానం?
    1) హెర్బార్షియన్ విధానం
    2) బ్లూమ్స్ మూల్యాంకన విధానం
    3) RCEM విధానం
    4) పైవన్నీ
  21. కిందివాటిలో హెర్బార్షియన్ విధానంలోని దశ ఏది?
    1) వివరించడం
    2) పరిశీలించడం
    3) భేదాలు గుర్తించడం
    4) పోలిక లేదా సంసర్గం
  22. హెర్బార్షియన్ విధానంలో బోధించబోయే పాఠ్యాంశానికి సంబంధించిన విద్యార్థి పూర్వ జ్ఞానాన్ని ఏ దశలో తెలుసుకుంటారు?
    1) సాధారణీకరం
    2) అన్వయం
    3) సన్నాహం
    4) హాజరుపరచడం
  23. పాఠ్యపథక నిర్మాణంలో సమ్మిళిత కృత్యాలు అంటే?
    1) ఉన్ముఖీకరణ
    2) అభ్యసించిన విషయ జ్ఞానంతో సాధారణీకరణ, నియోజన
    3) బోధనా విషయాన్ని హాజరు పరచడం
    4) శీర్షికా ప్రకటన
  24. అన్ని సబ్జెక్టుల బోధనకు అనుకూలమైన విధానం?
    1) హెర్బార్షియన్ విధానం
    2) బ్లూమ్స్ విధానం
    3) RCEM విధానం
    4) ఏదీకాదు
  25. బ్లూమ్స్ విధానంలో ఎన్ని సోపానాలు ఉన్నాయి?
    1) 5
    2) 3
    3) 4
    4) 2
  26. కిందివాటిలో బ్లూమ్స్ విధానంలో లేని దశ లేదా మూల్యాంకన ఉపగమం పాఠ్యపథక దశ కానిది?
    1) విద్యా లక్ష్యాల రూపకల్పన
    2) అభ్యసన అనుభవాల కల్పన
    3) పునఃశ్చరణ
    4) ప్రవర్తనా మార్పును మూల్యాంకనం చేయడం
  27. హెర్బార్ట్‌ విధానంలో విషయ వ్యవస్థీకరణ లేదా హాజరుపరచడానికి ప్రాముఖ్యం ఇచ్చారు. బ్లూమ్స్ విధానంలో దేనికి ప్రాధాన్యం ఇచ్చారు?
    1) బోధనోపకరణ
    2) అభ్యసనం
    3) బోధన
    4) లక్ష్యాధార కృత్యాలు
  28. ‘ఫలవంతమైన బోధన అంటే తాను పనిచేసే వాతావరణంలోని వ్యక్తుల చేత మెప్పు పొందేలా, నిర్ధారిత ఫలితాల సాధనకు ప్రత్యేక రీతిలోని ఉపాధ్యాయుని సామర్థ్యం’ అని తెలిపిన వారెవరు?
    1) బిడిల్
    2) హెర్బార్ట్‌
    3) బ్లూమ్స్
    4) ప్రెస్టన్
  29. ‘సూక్ష్మంగా చెప్పాలంటే ఒక వ్యక్తి జ్ఞానం, నైపుణ్యాలు, వైఖరులు, చింతనా పద్ధతులను సంపాదిస్తూ, ధారణ చేస్తూ వినియోగిస్తున్నప్పుడు అతడి ప్రవర్తన ఏ ప్రక్రియ ద్వారా సంస్కరితమవుతుందో ఆ ప్రక్రియే అభ్యసనం’ అని నిర్వచించినవారు?
    1) మన్
    2) కొలిస్నిక్
    3) గ్లేసెస్
    4) ప్రెస్టన్
  30. ‘చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం చేసే పనులు, పరిశీలనల వల్ల ఇంచుమించు శాశ్వతంగా సంస్కరితమయ్యే ప్రక్రియే అభ్యసనం’ అని నిర్వచించిన వారు?
    1) మన్
    2) కొలిస్నిక్
    3) గ్లేసెస్
    4) ప్రెస్టన్

సమాధానాలు

1) 2

2) 1

3) 1

4) 3

5) 3

6) 4

7) 1

8) 2

9) 3

10) 2

11) 4

12) 3

13) 2

14) 1

15) 4

16) 3

17) 2

18) 2

19) 2

20) 1

21) 4

22) 3

23) 2

24) 1

25) 3

26) 3

27) 4

28) 1

29) 2

30) 1

గతంలో అడిగిన ప్రశ్నలు

  1. అభ్యసన అనుభవాల జ్ఞానాత్మక, భౌతిక, స్వాభావిక వనరుల ప్రధాన వనరు? (డీఎస్సీ-2012)
    1) తరగతి గది
    2) ప్రసార మాధ్యమాలు
    3) సమాజం
    4) పాఠశాల
  2. వార్షిక ప్రణాళికను ఎప్పుడు, ఎవరు రూపొందించాలి? (డీఎస్సీ-2012)
    1) నూతన సంవత్సరానికి, ఉపాధ్యాయుడు
    2) సంవత్సర ఆరంభంలో, ఉపాధ్యాయుడు
    3) విద్యా సంవత్సర ఆరంభంలో, ఉపాధ్యాయుడు
    4) విద్యా సంవత్సరాంతంలో నూతన విద్యాసంవత్సరానికి, ఉపాధ్యాయుడు
  3. ఫలవంతమైన బోధన అంటే? (డీఎస్సీ-2004)
    1) తాను పనిచేసే ప్రదేశంలోని వ్యక్తుల మెప్పు పొందేలా, నిర్ధారిత ఫలితాల సాధన కోసం ఉపాధ్యాయుడు ప్రత్యేక రీతిలో ప్రదర్శించే సామర్థ్యం
    2) విద్యార్థుల్లో పఠన, లేఖన శక్తులను పెంపొందించడం
    3) పాఠ్య ప్రణాళిక పూర్తి చేసి, పరీక్షలు నిర్వహించడం
    4) బోధన తన విధి అన్నట్లుగా పాఠాలు చెప్పడం
  4. విద్యార్థిలో అతి ప్రధాన ఫలితాలు కనిపించేటట్లు రూపొందిన సమాచారాలు అనుభవాల సవ్యవస్థిత కేంద్రరాశి? (డీఎస్సీ-2004)
    1) పాఠం
    2) సబ్ యూనిట్
    3) యూనిట్
    4) పాఠ్య పుస్తకం
  5. డాక్టర్ మారిషస్ విధానంలో యూనిట్‌లో ఉండే దశల సంఖ్య? (డీఎస్సీ-2004)
    1) 5
    2) 4
    3) 3
    4) 2
  6. పాఠ్యపథక రచనలో తొలిసారిగా ఒక క్రమబద్ధమైన విధానాన్ని ప్రవేశ పెట్టింది? (డీఎస్సీ-2002)
    1) మోరిసన్
    2) జె.ఎస్. హెర్బర్ట్‌
    3) బ్లూమ్స్
    4) గెగ్నే

సమాధానాలు

1) 3

2) 4

3) 1

4) 3

5) 1

6) 2

Published date : 14 Mar 2015 12:09PM

Photo Stories