అనియత విజ్ఞాన శాస్త్ర విద్య
Sakshi Education
- ఏ రకమైన నియమ నిబంధనలు లేకుండా సైన్స్‌పై అవగాహన ఏర్పర్చి, శాస్త్రీయ వైఖరులను అభివృద్ధి చేయడానికి పాటించే పద్ధతులేవి?
1) విద్యా సాంకేతిక శాస్త్ర కార్యక్రమాలు
2) నిర్బంధ విద్యా కార్యక్రమాలు
3) అనియత విజ్ఞాన శాస్త్ర కార్యక్రమాలు
4) పాఠ్యేతర విజ్ఞాన శాస్త్ర కార్యక్రమాలు - వైజ్ఞానిక సంఘాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, మ్యూజియాలు, సైన్స్ కమ్యూనిటీ సెంటర్‌లు.. సైన్స్ ఫెయిర్స్ (ప్రదర్శన)ల ద్వారా అందించే విజ్ఞాన శాస్త్ర విద్య?
1) నియత విజ్ఞాన శాస్త్ర విద్య
2) నిర్బంధ విజ్ఞాన శాస్త్ర విద్య
3) విద్య సాంకేతిక శాస్త్రం
4) అనియత విజ్ఞాన శాస్త్ర విద్య - వైజ్ఞానిక సంఘాలు ఏ రంగాలను ప్రభావితం చేస్తాయి?
1) జ్ఞానాత్మక - భావావేశ
2) భావావేశ, మానసిక చలనాత్మక
3) మానసిక చలనాత్మక, జ్ఞానాత్మక
4) జ్ఞాన, భావావేశ, మానసిక చలనాత్మక - వైజ్ఞానిక సంఘాలు విద్యార్థులకు పని - అనుభవం కలిగించే ప్రక్రియలు అని తెలిపినవారు?
1) మొదలియార్
2) కొఠారీ
3) తారాదేవి
4) రాధాకృష్ణన్ - కిందివాటిలో ఏది వైజ్ఞానిక సంఘ లక్ష్యం కాదు?
1) విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులను పెంపొందించడం
2) అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్మడం
3) విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను, పెంపొందించడం
4) విరామకాలాన్ని సద్వినియోగపర్చుకునేలా చేయడం - సాధారణ సంఘాలు, ప్రత్యేక అభిరుచి సంఘాలు అనేవి ఏ సంఘంలో రకాలు?
1) వైజ్ఞానిక సంఘం
2) విహార యాత్ర సంఘం
3) సేవా సంఘం
4) శాస్త్రవేత్తల సంఘం - ఫొటోగ్రాఫర్ క్లబ్ ఏ రకమైన సంఘం?
1) సాధారణ సంఘం
2) సాంస్కృతిక సంఘం
3) ప్రత్యేక అభిరుచి సంఘం
4) సేవా సంఘం - పాఠశాలలో వైజ్ఞానిక సంఘానికి మార్గదర్శి లేదా ప్రతిపాదకుడుగా వ్యవహరించాల్సిన వారు?
1) ప్రధానోపాధ్యాయుడు
2) డీఈవో
3) ఆ ప్రాంతంలోని శాస్త్రవేత్త
4) విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు - కిందివాటిలో వైజ్ఞానిక సంఘం ఏర్పాటుకు పరిగణనలోకి తీసుకోని అంశం ఏది?
1) ప్రభుత్వ గుర్తింపు
2) కమిటీల ఏర్పాటు
3) నియమాలు
4) సమావేశాలు, కార్యక్రమాలు - NCERT సూచనల ప్రకారం వైజ్ఞానిక సంఘంలో ప్రధానోపాధ్యాయుని పాత్ర?
1) మార్గదర్శి
2) నియంత
3) పోషకుడు
4) సేవకుడు - సంఘం ఉద్దేశాలను, సంఘ కార్యక్రమాలను, ప్రదర్శనలు, వైజ్ఞానిక నాటకాల గురించి పరిసర సమాజానికి తెలియజేసే వైజ్ఞానిక సంఘ నిర్వాహక కమిటీ వ్యక్తి?
1) అధ్యక్షుడు
2) కార్యదర్శి
3) పోషకుడు
4) ప్రచారాధికారి - కిందివాటిలో ఏది వైజ్ఞానిక సంఘ కార్యక్రమం కాదు?
1) క్షేత్ర పర్యటన
2) మాక్ పార్లమెంట్ నిర్వహణ
3) బడి తోట నిర్వహణ
4) పర్యావరణ దినోత్సవ నిర్వహణ - విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు, తగిన నైపుణ్యాలు పెంపొందించి వారు భావి శాస్త్రవేత్తలుగా రూపుదిద్దుకొనేందుకు ప్రతి ఏటా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు?
1) మండల విద్యాశాఖ
2) రాష్ర్ట విద్యాశాఖ
3) NCERT
4) CBSE - జిల్లా స్థాయి, రాష్ర్ట స్థాయిల వైజ్ఞానిక ప్రదర్శనలు ఎవరి ఆర్థిక సహాయంతో జరుగుతాయి?
1) NCERT– SCERT
2) విద్యా శాఖా మంత్రి
3) ముఖ్యమంత్రి
4) డీఈవో - జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన కమిటీ చైర్మన్‌గా వ్యవహరించేవారు?
1) కలెక్టర్
2) డీఈవో
3) డైట్ ప్రిన్సిపాల్
4) జిల్లాలో అవార్డు తెచ్చుకున్న సైన్స్ టీచర్ - లైబ్రరీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
1) గ్రీకు
2) పర్షియా
3) ఇంగ్లిష్
4) లాటిన్ - ‘లైబర్’ అనే మాటకు అర్థం?
1) పుస్తకం
2) రాయడం
3) జ్ఞానం
4) సేకరించడం - విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం ఎవరి ఆధీనంలో ఉంటుంది?
1) ప్రధానోపాధ్యాయుడు
2) జిల్లా విద్యాశాఖాధికారి
3) తరగతిలో, సైన్స్‌లో తెలివి కలిగిన విద్యార్థి
4) విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు - వేటి నిర్వహణలో ఇండెక్స్ కార్డ్, క్యాటలాగ్‌లను తప్పనిసరిగా ఏర్పర్చాలి?
1) సైన్స్ క్లబ్
2) సైన్స్ లైబ్రరీ
3) సైన్స్ ఫేర్
4) ఫీల్డ్ ట్రిప్ - ప్రతి పాఠశాలలో ప్రత్యేక విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం ఉండాలి అని ప్రతిపాదించిన వారు?
1) కొఠారీ కమిషన్
2) మొదలియార్ కమిషన్
3) ఆలిండియా సైన్స్ సెమినార్
4) రాధాకృష్ణన్ కమిషన్ - హైదరాబాద్‌లోని ప్లానిటోరియం పేరు?
1) బిర్లా
2) టాటా
3) గెలాక్సీ
4) గెలీలియో - విక్రం సారాభాయ్ సమాజ విజ్ఞాన కేంద్రాన్ని 1966లో ఎక్కడ ప్రారంభించారు?
1) అహ్మదాబాద్
2) ముంబై
3) లక్నో
4) అలహాబాద్ - అంతర్జాతీయ సైన్స్ మ్యూజియాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిర్వహిస్తుంది?
1) హైదరాబాద్
2) కోల్‌కతా
3) చెన్నై
4) న్యూఢిల్లీ
సమాధానాలు
1) 3 | 2) 4 | 3) 4 | 4) 2 | 5) 2 | 6) 1 | 7) 3 | 8) 4 | 9) 1 | 10) 3 |
11) 4 | 12) 2 | 13) 3 | 14) 1 | 15) 2 | 16) 1 | 17) 1 | 18) 4 | 19) 2 | 20) 3 |
21) 1 | 22) 1 | 23) 2 |
Published date : 11 Feb 2015 04:20PM