Skip to main content

7,306 గురుకుల టీచర్ పోస్టులకు రీ నోటిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గురుకుల ఉపాధ్యాయులు, ఇతర పోస్టుల భర్తీకి తొమ్మిది కొత్త నోటిఫికేషన్లు (రీ నోటిఫికేషన్స్) ఈనెల 13న జారీ అయ్యాయి.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మొత్తంగా 7,306 పోస్టులతో ఈ నోటిఫికేషన్లను జారీ చేసింది. అభ్యర్థులు ఈనెల 18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని.. పూర్తి వివరాలను త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు బీఎడ్‌తోపాటు పీజీలో 60 శాతం మార్కులు, ట్రైన్‌‌డ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు బీఎడ్‌తోపాటు డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. దాంతో ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని మార్పులు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎన్‌సీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సంక్షేమ శాఖలు రూపొందించిన నిబంధనలతో తాజా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

తాజా నిబంధనలు ఇలా..
తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఉపాధ్యాయ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులు బీఎడ్‌తోపాటు పీజీ, డిగ్రీలో 45 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు. ఇతరులు బీఎడ్‌తో పాటు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎక్స్ సర్వీస్‌మెన్‌కు రిజర్వేషన్ ఉంటుంది. ఇక డీఎడ్-డిగ్రీ పూర్తి చేసిన వారికి టీజీటీ పోస్టుల్లో అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. బీకాం వారికి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వారికి కూడా పోస్టుల్లో అర్హత కల్పించినట్లు సమాచారం. టీజీటీ పోస్టులకు అభ్యర్థులు బీఎడ్‌తో పాటు టెట్‌లోనూ అర్హత సాధించి ఉండాలి. అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు పూర్తిస్థాయి నోటిఫికేషన్ వచ్చాకే వెల్లడికానున్నాయి.

ఇవీ కేటగిరీలు, శాఖల వారీగా పోస్టులు...

కేటగిరీ

సోషల్‌వెల్ఫేర్

విద్యాశాఖ

బీసీ

గిరిజన

మైనారిటీ

మొత్తం

టీజీటీ

1,281

74

1,170

621

1,216

4,362

పీజీటీ

257

136

83

165

280

921

పీడీ

-

-

-

6

-

6

పీఈటీ

182

22

135

83

194

616

ఆర్ట్ టీచర్

63

15

69

30

195

372

క్రాఫ్ట్ టీచర్

3

14

26

-

-

43

మ్యూజిక్ టీచర్

92

14

52

39

-

197

స్టాఫ్ నర్సు

121

32

135

50

195

533

లైబ్రేరియన్

137

-

119

-

-

256

మొత్తం

2,136

307

1,789

994

2,080

7,306

Published date : 17 Apr 2017 12:19PM

Photo Stories