Skip to main content

అలంకారాలు - మాదిరి ప్రశ్నలు

కావ్య సరస్వతికి శోభను చేకూర్చేవి అలంకారాలు. ‘అలం’ శబ్దానికి ‘కృ’ ధాతువు చేరి ‘అలంకారం’ రూపం ఏర్పడింది. అలంకారమంటే భూషణమని అర్థం. కావ్య సౌందర్యాన్ని పెంపొందించి శోభను కలిగించేవి అలంకారాలు. అలంకారికులు ప్రధానంగా శబ్దా లంకారాలు, అర్థాలంకారాలు రెండు రకాలుగా పేర్కొన్నారు.
శబ్ద ప్రధానమైనవి శబ్దాలంకారాలు. శబ్ద వైచిత్రీ రామణీయకత చేత కావ్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి శబ్దాలంకారాలు. సంగీతానుగుణ్యమైన శ్రవణ లాలిత్యంతో పాఠకులకు ఆహ్లాదం కలిగించే శబ్దాలంకారాలు.
ఇవి ఆరు విధాలు..
1) వృత్త్యానుప్రాసం
2) ఛేకానుప్రాసం
3) లాటానుప్రాసం
4) అంత్యానుప్రాసం
5) యమకం
6) ముక్తపదగ్రస్థం

అర్థాలంకారాలు: అర్థ సౌందర్యం చేత కావ్య శోభను ద్విగుణీకృతం చేసేవి అర్థాలంకారాలు. అర్థం లేని శబ్ద సౌందర్యం ఆహ్లాదకరం కాదు. అర్థ ప్రధానమైన అలంకారాలు అర్థాలంకారాలు. ఉపమ, రూపకం ఉత్ప్రేక్ష మొదైలైనవన్నీ అర్థాలంకారాలు.

Published date : 05 Nov 2018 04:35PM

Photo Stories