Skip to main content

బోధనోపకరణాలు

  1. బోధనోపకరణం ద్వారా దృష్టి, వినికిడిని ఏకకాలంలో ఉపయోగించి విద్యార్థి అభ్యసన అనుభవాన్ని పెంపొందిస్తే దాన్ని దృశ్య శ్రవణ బోధనోపకరణం అంటారని నిర్వచించిందెవరు?
    1) బర్టన్
    2) కార్టర్ గుడ్
    3) ఎడ్గర్ డేల్
    4) జేమ్స్ వాట్
  2. చూడడం ద్వారా అభ్యసన స్థాయి శాతం?
    1) 11%
    2) 35%
    3) 83%
    4) 100%
  3. చెప్పడం, చేయడం ద్వారా స్మృతి స్థాయి శాతం?
    1) 60%
    2) 75%
    3) 50%
    4) 90%
  4. అభ్యసనానుభవాలను బట్టి బోధనోపకరణాలను మూడు విధాలుగా వర్గీకరించినవారు?
    1) జి.ఎస్.బ్రూనర్
    2) కార్టర్ ఎ.గుడ్
    3) బర్టన్
    4) ఎడ్గర్ డేల్
  5. నమూనాలు ఏ రకానికి చెందిన బోధనోపకరణాలు?
    1) ప్రత్యక్షానుభవాన్నిచ్చేవి
    2) ఆరోపిత అనుభవాన్నిచ్చేవి
    3) గుర్తులతో అనుభవాన్నిచ్చేవి
    4) సంకల్పిత అనుభవాన్నిచ్చేవి
  6. ప్రయోగాలు చేయడం ఏ రకమైన బోధనోపకరణం?
    1) ఆరోపిత
    2) ప్రత్యక్ష అనుభవ
    3) మాటలు లేదా గుర్తులతో
    4) ఏవీకాదు
  7. దృశ్య, శ్రవణ, దృశ్య-శ్రవణ, కృత్యాధార అనే బోధనోపకరణాల వర్గీకరణ దేన్ని బట్టి జరిగింది?
    1) అనుభవాలు
    2) పరిమాణం
    3) లభ్యత
    4) లక్షణాలు
  8. క్షేత్ర పర్యటన ఏ రకం బోధనోపకరణం?
    1) దృశ్య
    2) దృశ్య-శ్రవణ
    3) కృత్యాధార
    4) శ్రవణ
  9. ఎడ్గర్ డేల్ బోధనోపకరణాలను అనుభవాలను బట్టి ఏ ఆకారంలో అమర్చారు?
    1) గోళాకారం
    2) చతురస్రాకారం
    3) శంఖాకారం
    4) చతుర్భుజాకారం
  10. ఎడ్గర్ డేల్ శంఖువులో ప్రత్యక్ష అనుభవాల స్థానం?
    1) పీఠ భాగం
    2) శిఖర భాగం
    3) మధ్య భాగం
    4) కింది భాగం
  11. ఎడ్గర్ డేల్ శంఖువులో శాబ్దిక చిహ్నాల స్థానం?
    1) పీఠ భాగం
    2) శిఖర భాగం
    3) మధ్య భాగం
    4) ఎక్కడైనా ఉండొచ్చు
  12. పోషకాహార విలువలను నృత్య రూపకంగా చేసి బోధించడం?
    1) ప్రత్యక్ష అనుభవం
    2) క్షేత్ర పర్యటన
    3) ప్రదర్శన
    4) నాటకీకరణ
  13. ప్లానెల్ బోర్డ్‌ ఏ రకానికి చెందిన బోధనోపకరణం?
    1) ప్రదర్శనా ఉపకరణాలు
    2) త్రిపరిమాణ ఉపకరణం
    3) రేఖీయ చిత్రం
    4) ప్రక్షేపిత ఉపకరణం
  14. మాతృకలు (స్పెసిమన్) ఏ రకం బోధనోపకరణం?
    1) ప్రదర్శన
    2) ప్రక్షేపిత
    3) కృత్యాధార
    4) త్రిపరిమాణ
  15. ఫిల్మ్ ప్రొజెక్టర్ ఏ రకం బోధనోపకరణం?
    1) ప్రదర్శన
    2) ప్రక్షేపిత
    3) కృత్యాధార
    4) త్రిపరిమాణ
  16. ఎడ్గర్ డేల్ అనుభవ శంఖువులో ప్రొజెక్టర్‌ల స్థానం?
    1) ప్రదర్శన బల్లలపైన
    2) చార్టు తర్వాత
    3) చలనచిత్రాలపైన
    4) శాబ్దిక చిహ్నాలపైన
  17. జంతువుల వర్గీకరణ రాయడానికి ఏ రకం చార్ట్‌ అవసరం?
    1) వ్యవస్థానుక్రమ
    2) దత్తాంశ
    3) వంశవృక్ష
    4) క్రమానుగత
  18. బార్ గ్రాఫ్‌లను ఏ విధంగా పిలుస్తారు?
    1) హిస్టోగ్రామ్‌లు
    2) లైన్ గ్రాఫ్‌లు
    3) సెక్టర్ గ్రాఫ్‌లు
    4) వ్యంగ్య చిత్రాలు
  19. వీటిలో ఏది ప్రత్యక్ష అనుభవానికి దగ్గరగా ఉంటుంది?
    1) రేఖా చిత్రం
    2) త్రిమితీయ ఉపకరణం
    3) రేడియో
    4) శాబ్దిక చిహ్నం
  20. తోలుబొమ్మలు ఏ రకం బోధనోపకరణం?
    1) కృత్యాధార
    2) ప్రదర్శన
    3) ప్రక్షేపిత
    4) త్రిమితీయ
  21. అపార దర్శక వస్తువులను ఏ ఉపకరణం ద్వారా ప్రక్షేపితం చేయొచ్చు?
    1) ఫిల్మ్ ప్రొజెక్టర్
    2) ఓవర్‌హెడ్ ప్రొజెక్టర్
    3) ఎపిడయాస్కోప్
    4) మైక్రో ప్రొజెక్టర్
  22. మైక్రో ప్రొజెక్టర్ ప్రత్యేకత ఏమిటి?
    1) ఉపాధ్యాయుడి వెనుక ప్రతిబింబం
    2) అపారదర్శకత కలిగిన వస్తువుల ప్రక్షేపణ
    3) సూక్ష్మదర్శినిలోని స్లైడుల ప్రక్షేపణ
    4) సెల్లోఫెన్ పేపర్‌పైన వేసిన బొమ్మల ప్రక్షేపణ
  23. ప్రొజెక్టర్ ఉపాధ్యాయుడి దగ్గరే ఉండి ప్రతిబింబం కూడా ఆయన వైపే ప్రక్షేపించడం ఏ ప్రొజెక్టర్ లక్షణం?
    1) స్లైడ్ ప్రొజెక్టర్
    2) ఓవర్ హెడ్ ప్రొజెక్టర్
    3) ఎపిడయాస్కోప్
    4) మైక్రో ప్రొజెక్టర్
  24. భారతదేశంలో దూరదర్శన్ ప్రయోగాత్మక ప్రసారాలు ప్రారంభించిన సంవత్సరం?
    1) 1959
    2) 1961
    3) 1987
    4) 1998
  25. బడి తోట పెంచడం ఏ కమిటీ సూచించిన SUPWలో ఒక భాగం?
    1) మొదలియార్
    2) తారాదేవి
    3) ఈశ్వరీబాయి
    4) కొఠారీ
  26. వైజ్ఞానిక సంఘాలు ఏ రకం బోధనోపకరణాల కిందకు వస్తాయి?
    1) ప్రక్షేపిత
    2) కృత్యాధార
    3) పరోక్ష
    4) దృశ్య శ్రవణ
  27. 1959లో మొదటి బిర్లా పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు?
    1) కోల్‌కతా
    2) ముంబై
    3) హైదరాబాద్
    4) ఢిల్లీ
  28. 1977లో ముంబైలో ఏ విజ్ఞాన శాస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు?
    1) బిర్లా ప్లానిటోరియం
    2) విశ్వేశ్వరయ్య మ్యూజియం
    3) నెహ్రూ విజ్ఞాన కేంద్రం
    4) జాతీయ విజ్ఞాన కేంద్రం
  29. మొక్కలను లేదా వాటి భాగాలను కొంతకాలం ఎండబెట్టి భద్రపర్చే విధానం?
    1) వివేరియం
    2) చేధనం
    3) టెర్రేరియం
    4) హెర్బేరియం
  30. అక్వేరియం అనేది ఒక?
    1) అందాన్నిచ్చే వస్తువు
    2) కృత్రిమ జీవావరణ వ్యవస్థ
    3) అన్ని రకాల జీవులుండే స్థలం
    4) చీకటి జీవులను తెలుసుకునేది
  31. ప్రత్యేక స్థలాల్లో జీవించి ఉన్న జంతువులకు సహజ స్థితులను ఏర్పర్చి పరిశీలించడాన్ని ఏమంటారు?
    1) వివేరియం
    2) అక్వేరియం
    3) హెర్బేరియం
    4) టెర్రేరియం
  32. కీటకాల జీవిత చరిత్రను బోధించేందుకు దేన్ని ఉపయోగించవచ్చు?
    1) అక్వేరియం
    2) వివేరియం
    3) హెర్బేరియం
    4) టెర్రేరియం
  33. భూచరాలయాన్ని ఏ విధంగా పిలుస్తారు?
    1) వివేరియం
    2) హెర్బేరియం
    3) అక్వేరియం
    4) టెర్రేరియం
  34. అక్వేరియంలో ఉండే జీవులు?
    1) కీటకాలు
    2) చేపలు
    3) వృక్షాలు
    4) మానవులు
  35. అక్వేరియంలో ఏ మొక్కలను పెంచుతారు?
    1) గులాబీ మొక్కలు
    2) కాక్టస్
    3) హైడ్రిల్లా
    4) గడ్డి మొక్కలు

సమాధానాలు

1) 2 2) 3 3) 4 4) 1 5) 2 6) 2 7) 4 8) 3 9) 3 10) 1
11) 2 12) 4 13) 1 14) 4 15) 2 16) 3 17) 3 18) 1 19) 2 20) 4
21) 3 22) 3 23) 2 24) 1 25) 3 26) 2 27) 1 28) 3 29) 4 30) 2
31) 1 32) 2 33) 4 34) 2 35) 3
Published date : 11 Feb 2015 03:53PM

Photo Stories