Sakshi Effect: ‘ఉన్నతి’ శిక్షణను పరిశీలించిన అధికారులు
ఆదిలాబాద్ టౌన్: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఉన్నతి శిక్షణను ఎస్‌సీఈఆర్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సువర్ణ వినాయక్ పరిశీలించారు. ‘ఇదేమి ఉన్నతి.. విద్యార్థులకు ‘శిక్ష’ణా’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు.
శిక్షణ కేంద్రంలో ఉపాధ్యాయులకు సౌకర్యాలు కల్పించకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతులు కల్పించకుండా ఏవిధంగా శిక్షణ నిర్వహిస్తారని ప్రశ్నించారు.
MBBS Students Ragging: మెడికల్ విద్యార్థులకు ఇది తగునా... ఏడాది సస్పెండ్, హాస్టల్ కి కూడా నో
విద్యార్థుల చేత కుర్చీలు ఎందుకు మోయించారని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు ఉన్నతి శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ కంటె నర్స య్య, రాష్ట్ర రిసోర్స్ గ్రూప్ సభ్యులు అశోక్, పసుల ప్రతాప్, డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిరణ్‌కుమార్, రిసోర్స్ పర్సన్‌లు ఆశన్న, చరణ్‌దాస్, వేణుగో పాల్, పొచ్చన్న, రవికుమార్, స్వామి పాల్గొన్నారు.