మహబూబాబాద్ అర్బన్: ఐటీడీఐ ఏటూరునాగారం ఆధ్వర్యంలో మానుకోట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 28న ఉదయం 10:30గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి గుగులోత్ దేశీరాంనాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Job Opportunities 2025
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీ పార్మసీ, డీ ఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, బీటెక్ కోర్సులు పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు తమ బయోడేటా, విద్యార్హతలు జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 80089 32159, 79816 33716 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
జాబ్‌మేళా ముఖ్య సమాచారం:
ఎప్పుడు: జనవరి 28న ఎక్కడ: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మానుకోట