Skip to main content

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. ఈనెల 20న జాబ్ మేళా.. ఎక్క‌డంటే..

నిరుద్యోగ యువతకు శుభవార్త.
Job Mela in Visakhapatnam   employment opportunity invisakhapatnam

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ఫిబ్రవరి 20వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా సబ్ రీజినల్ ఎంప్లాయిమెంట్ అధికారి ఎన్.శ్యాంసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా నిరుద్యోగ యువతకు మంచి అవకాశమ‌ని, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్యాంసుందర్ అన్నారు.

ఈ జాబ్ మేళాలో.. విప్రో సొల్యూషన్, అస్ట్రోటెక్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు పాల్గొని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి.

అర్హతలు: 18-35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప‌దవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ(MBA), ఎంసీఏ(MCA) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

కావలసిన పత్రాలు: బయోడేటా(Resume), పాన్ కార్డు, ఆధార్ కార్డు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు.
 
వేదిక: నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్, విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయం.

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 6304634447, 9398338105

Job Mela: ఫిబ్ర‌వ‌రి 20వ తేదీ జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే..
Published date : 19 Feb 2025 09:08AM

Photo Stories