Skip to main content

సివిల్స్-2017నోటిఫికేషన్ విడుదల

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2017 ప్రకటన విడుదలైంది. మొత్తం 980 పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ వెలువరించింది. ఈ పరీక్ష ద్వారా జాతీయ స్థాయిలో ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ వంటి 24 అఖిల భారత సర్వీసుల్లో పోస్టులను భర్తీ చేస్తారు.
సివిల్స్ ద్వారా భర్తీ చేసే సర్వీసులు...
సివిల్స్ పరీక్ష ద్వారా మొత్తం 24 సర్వీసుల్లో పోస్టులను భర్తీ చేస్తారు.
అవి..
  1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)
  2. ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్)
  3. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)
  4. ఇండియన్ పీ అండ్ టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ (గ్రూప్-ఎ)
  5. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ (గ్రూప్-ఎ)
  6. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్), గ్రూప్-ఎ
  7. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్-ఎ
  8. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐటీ), గ్రూప్-ఎ
  9. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీస్, గ్రూప్-ఎ (అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్)
  10. ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్-ఎ
  11. ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్-ఎ
  12. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, గ్రూప్-ఎ
  13. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, గ్రూప్-ఎ
  14. ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, గ్రూప్-ఎ
  15. పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గ్రూప్-ఎ
  16. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్-ఎ
  17. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (జూనియర్ గ్రేడ్), గ్రూప్-ఎ
  18. ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్-ఎ, (గ్రేడ్-3)
  19. ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, గ్రూప్-ఎ
  20. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్, గ్రూప్ బి (సెక్షన్ ఆఫీసర్స్ గ్రేడ్)
  21. ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ సివిల్ సర్వీస్, గ్రూప్-బి
  22. ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ పోలీస్ సర్వీస్, గ్రూప్-బి
  23. పాండిచ్చేరి సివిల్ సర్వీస్, గ్రూప్-బి
  24. పాండిచ్చేరి పోలీస్ సర్వీస్, గ్రూప్-బి

అర్హతలు.. వయో పరిమితి :
  1. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు అర్హులే. వీరు మెయిన్స్ నాటికి ఉత్తీర్ణులై ఉండాలి.
  2. ఆగస్టు 1, 2017 నాటికి 21 - 32 ఏళ్లు. అభ్యర్థులు 1985 ఆగస్టు 2 కంటే ముందు- ఆగస్టు 1, 1996 తర్వాత జన్మించి ఉండకూడదు.
  3. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

పరీక్ష.. ప్రయత్నాలు :
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే విషయంలో గరిష్ట పరిమితి నిబంధన అమలవుతోంది. దీని ప్రకారం..
  1. జనరల్ కేటగిరీ అభ్యర్థులు నిర్దిష్ట వయోపరిమితి వ్యవధిలో ఆరుసార్లు మాత్రమే పరీక్ష రాసుకోవచ్చు.
  2. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు తొమ్మిదిసార్లు పరీక్షకు హాజరు కావచ్చు.
  3. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులు గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లైనా పరీక్ష రాసుకోవచ్చు.

ఎంపిక విధానం: రెండు విధాలుగా ఉంటుంది. అవి..
1. ప్రిలిమినరీ పరీక్ష, 2. మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ

ప్రిలిమినరీ పరీక్ష: సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో తొలి దశ.. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లలో 400 మార్కులకు ఉంటుంది. ప్రతి పేపర్‌కు కేటాయించిన మార్కులు 200. ప్రిలిమ్స్‌లో నిర్దేశించిన కనీస అర్హత మార్కులు, భర్తీ చేయనున్న ఖాళీలను అనుసరించి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:12 లేదా 1:13 (అంటే ఒక్కో పోస్ట్‌కు 12 లేదా 13) మందిని ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. కానీ.. అభ్యర్థులు తప్పనిసరిగా నిర్దిష్ట కనీస అర్హత మార్కులు పొందాలి. కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకే తదుపరి దశలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే అర్హత లభిస్తుంది.

పేపర్-1: (జనరల్ స్టడీస్): సమయం రెండు గంటలు
200 మార్కులకు జరిగే పేపర్-1 జనరల్ స్టడీస్‌లో మొత్తం ఏడు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అవి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యమున్న సమకాలీన సంఘటనలు; భారతదేశ చరిత్ర, భారత జాతీయ స్వాతంత్య్రోద్యమం; భారత్, ప్రపంచ భౌగోళిక శాస్త్రం (ఫిజికల్, సోషల్, ఎకనామిక్); భారత రాజ్యాంగం, పరిపాలన (రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ, హక్కుల వివాదాలు తదితర); ఆర్థిక, సామాజిక అభివృద్ధి- సంతులిత అభివృద్ధి, పేదరికం, ఇన్‌క్లూజన్, సామాజిక రంగ పథకాలు, డెమోగ్రాఫిక్స్; జనరల్ ఇష్యూస్ - ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీ, జీవ వైవిధ్యం, వాతావరణ మార్పు; జనరల్ సైన్స్

పేపర్-2 : 200 మార్కులు, సమయం: రెండు గంటలు
జీఎస్ పేపర్(2): దీన్నే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)గా పేర్కొంటున్నారు. ఇందులో మాత్రం తప్పనిసరిగా 33 శాతం మార్కులు పొందాలి. సిలబస్‌లో... కాంప్రహెన్షన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ ఎనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ (పదో తరగతి స్థాయి) అంశాలు ఉంటాయి.

మెయిన్ పరీక్ష విధానం :
సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో రెండో దశ.. మెయిన్ ఎగ్జామినేషన్. పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే ఈ పరీక్ష అభ్యర్థుల్లోని సామాజిక అవగాహన, సబ్జెక్ట్ నైపుణ్యాలను పరిశీలించే విధంగా ఉంటుంది. మెయిన్ పరీక్షలో మొత్తం తొమ్మిది పేపర్లు ఉంటాయి. ఈ తొమ్మిది పేపర్లలో కేవలం అర్హత పరీక్షలుగా పరిగణించేవి పేపర్-ఎ, పేపర్-బి.

పేపర్-ఎ: అభ్యర్థులు ఎంపిక చేసుకునే ఏదైనా లాంగ్వేజ్‌లో (రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్‌లో పొందుపరిచిన భాషల నుంచి ఏదైనా ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి) నైపుణ్యాలను పరీక్షించే పేపర్ ఇది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలుగును ఎంపిక చేసుకుని రాయొచ్చు. దీనికి కేటాయించిన మార్కులు 300.

పేపర్-బి- ఇంగ్లిష్ : అభ్యర్థుల్లోని బేసిక్ ఇంగ్లిష్ నైపుణ్యాలను పరిశీలించేందు కు ఉద్దేశించిన పరీక్ష ఇది. దీనికి కూడా మార్కులు 300. వీటిలో పొందిన మార్కులను కూడా ఫైనల్ ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకోరు. పేపర్ ఎ, బి కేవలం అర్హత పేపర్లు మాత్రమే. కానీ వీటిలో కనీస మార్కులు (25 శాతం చొప్పున) పొందితేనే మెయిన్ ఎగ్జామినేషన్‌లో మెరిట్ జాబితా రూపకల్పనలో పరిగణించే మిగతా ఏడు పేపర్ల మూల్యాంకనం జరుగుతుంది.

మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే ఇంటర్య్యూ :
సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో తుది దశ.. అభ్యర్థులను విజయం అంచున నిలిపే దశ ఇంటర్వ్యూ. మెయిన్స్‌లో నిర్దేశించిన ఏడు పేపర్లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను భర్తీ చేయనున్న పోస్ట్‌ల ఆధారంగా 1:2 లేదా 1:2.25 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థుల్లోని సామాజిక అవగాహన, నిర్ణయాత్మక నైపుణ్యం వంటివి తెలుసుకునేందుకు యత్నిస్తారు. ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 275.

ముఖ్యమైన ఏడు పేపర్లు :
మెరిట్ జాబితా రూపకల్పన, చివరి దశలోని ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఈ ఏడు పేపర్లలో వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటుంది.

పేపర్

అంశాలు

మార్కులు

పేపర్-1

జనరల్ ఎస్సే

250

పేపర్-2 (జీఎస్-1)

భారతవారసత్వం, సంస్కృతి, చరిత్ర, జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ

250

పేపర్-3 (జీఎస్-2)

గవర్నెన్స్, కాన్‌స్టిట్యూషన్, పాలిటీ సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్

250

పేపర్-4(జీఎస్-3)

టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్‌మెంట్ బయో డైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్

250

పేపర్-5 (జీఎస్-4)

ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్

250

పేపర్-6

ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1

250

పేపర్-7

ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-2

250

మొత్తం మార్కులు

1750


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఏదైనా ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకుల్లో రూ.100 చెల్లించాలి లేదా క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించొచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: మార్చి 17, 2017
ప్రిలిమ్స్ పరీక్ష తేది: జూన్ 18, 2017
మెయిన్స్ పరీక్షలు: అక్టోబర్, 2017

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అనంతపూర్, హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి

మెయిన్స్ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.upsconline.nic.in

For Civil Services Preparation Guidance Click Here

For Civil Services Material Click Here

For Civil Services Previous Papers Click Here

For Civil Services Online Tests Click Here 
Published date : 23 Feb 2017 12:32PM

Photo Stories