Skip to main content

TS PGECET Results 2023 direct link : పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల.. ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్)-2023 ఫలితాలను జూన్ 8వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేశారు.
TS PGECET 2023 Results News in Telugu
TS PGECET Results 2023

ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. మే 29 నుంచి జూన్‌ 1 వరకు ప్రవేశ పరీక్ష సీబీటీ విధానంలో ఈ ప‌రీక్ష‌ను నిర్వహించారు. ఉద‌యం సెష‌న్‌కు 96.13 శాతం మంది విద్యార్థులు, మ‌ధ్యాహ్నం సెష‌న్‌కు 88.01 శాతం మంది విద్యార్థులు హాజ‌రయ్యారు. ఈ TS PGECET Results 2023 ఫ‌లితాల‌ను www.sakshieducation.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

☛➤ TS PGECET Results-2023 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

2023-24 విద్యా సంవత్సరంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌/ఫార్మసీ/ఆర్కిటెక్చర్‌ కాలేజీల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్‌, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీఈసెట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) నిర్వహించిన విషయం తెలిసిందే.

Published date : 08 Jun 2023 03:59PM

Photo Stories