Skip to main content

JAM 2025 Notification: జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ పరీక్ష పూర్తి వివరాలు ఇవే..

IIT JAM 2025 Notification  IIT JAM Admission Process IIT JAM Exam Date  IIT JAM 2025 Application Form  Eligibility Criteria for IIT JAM 2025  Apply for IIT JAM 2025  IIT JAM 2025 Important Dates  Admissions news  JAM 2025   Science disciplines covered by JAM 2025   Application process for JAM 2025  Benefits of attending JAM 2025  Participating institutions for JAM 2025   Postgraduate programs at IITs
Admissions news

జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌)2025–26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఐఐటీ జామ్‌ స్కోర్‌ ఆధారంగా దేశవ్యాప్తంగా 21 ఐఐటీ క్యాంపస్‌లలో, పీజీ స్థాయిలో ఆరు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

కోర్సు: ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ (టెక్నాలజీ); ఎంఎస్‌ (రీసెర్చ్‌); ఎమ్మెస్సీ–ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ, జాయింట్‌ ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ; ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ డ్యూయల్‌ డిగ్రీ కోర్సులు

Sucess Story Of Manoj Kumar: మధ్యతరగతి కుటుంబం.. ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికైన మనోజ్‌కుమార్‌

మొత్తం సీట్లు: 3000
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష విధానం: ఐఐటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎమ్మెస్సీ తదితర సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి జామ్‌ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు.మొత్తం ఏడు పేపర్లలో పరీక్ష జరుగుతుంది. అవి.. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌. అభ్యర్థులు గరిష్టంగా రెండు పేపర్లలో పరీక్షకు హాజరవ్వొచ్చు. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది.

Kalam World Records: నాలుగేళ్ల వయస్సులోనే ప్రపంచ రికార్డ్స్‌లో చోటు.. ఈ బుడతడి టాలెంట్‌ తెలిస్తే..

ముఖ్య సమాచారం

➤    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
➤    రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: సెప్టెంబర్‌ 03 నుంచి

➤  రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్‌ 11, 2024
➤  సవరణలకు చివరి తేది: నవంబర్‌ 18, 2024

➤  జామ్‌ పరీక్ష తేది: ఫిబ్రవరి 02, 2025
➤  ఫలితాల వెల్లడి: మార్చి 19, 2025

అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్‌: మార్చి 25, 2025
➤   వెబ్‌సైట్‌: https:// jam2025.iitd.ac.in/index.php

Published date : 07 Aug 2024 08:50AM

Photo Stories