Skip to main content

GATE 2024 notification: గేట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం‌..

ఐఐటీలు, నిట్‌లు వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌)-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్ష స్కోరు ఉన్నత విద్యతోపాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు ఉపయోగపడుతుంది. ఈసారి గేట్‌ను బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) నిర్వహించనుంది.
GATE 2024 notification

అర్హత: ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యుమానిటీస్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

చ‌ద‌వండిGATE Exam

పరీక్ష విధానం: అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు 1 లేదా 2 పేపర్లను ఎంపికచేసుకోవచ్చు. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: 24.08.2023
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 29.09.2023.
  • అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 13.10.2023. 
  • పరీక్ష తేదీలు: 03.02.2024, 04.02.2024, 10.02.2024, 11.02.2024.
  • పరీక్ష ఫలితాల విడుదల తేది: 16.03.2023.

వెబ్‌సైట్‌: https://gate2024.iisc.ac.in/

Last Date

Photo Stories