GATE 2025 Answer Key Released : గేట్ 2025 ఆన్సర్ కీ విడుదల.. డౌన్‌లోడ్ విధానం ఇలా.. ఫలితాలు ఇప్పుడంటే..!!

సాక్షి ఎడ్యుకేషన్: ఇటీవల పూర్తి చేసుకున్న గేట్-2025 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ ని ఐఐటీ.. ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కి నేడు.. ఫిబ్రవరి 27వ తేదీన విడుదల చేసింది. అభ్యర్థులు తాము రాసిన జవాబులను ఈ ఆన్సర్ కీ తో పరిశీలించుకుని, మార్కులను అంచనా వేయవచ్చు. గేట్ అధికారిక వెబ్‌సైట్ gate2025.iitr.ac.in నుంచి లేదా అప్లికేషన్ పోర్టల్ goaps.iitr.ac.in. నుంచి తమ ఆన్సర్ కీ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆన్సర్ కీ డౌన్‌లోడ్ విధానం..
ఐఐటీ రూర్కి ఈ నెలలో నిర్వహించిన గేట్ 2025 పరీక్షకు సంబంధించి ఆన్సర్ కీ ని ఈ విధంగా పరిశీలించుకోవచ్చు..
1. గేట్ అధికారిక వెబ్‌సైట్.. gate2025.iitr.ac.in.ను సందర్శించండి.
2. గేట్ 2025 ఆన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయండి.
Entry Exit System : వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి ఎంట్రీ ఎగ్జిట్ విధానం..!!
3. అక్కడ అడిన లాగిన్ వివరాలను నమోదు చయండి.
4. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే.. మీ ఆన్సర్ కీ కనిపిస్తుంది. ఇక, దానిని డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోండి.
మరో రెండు రోజులే..
అభ్యర్థులు తమ ఆన్సర్ కీని పరిశీలించినప్పుడు ఏదైనా సందేహాలు, లేదా వ్యత్యాసాలు కలిగితే వెంటనే అధికారిక వెబ్‌సైట్ నుంచి లేవనెత్తవచ్చు. అభ్యర్థులు వెంటనే తమ కీ ని పరిశీలించుకోవాలి. నేడు విడులైన కీ మార్చి 1వ తేదీ వరకు మాత్రమే లభిస్తుంది. ఇదిలా ఉంటే, తాత్కాలిక అభ్యర్థులు వారి అభ్యంతరాలను దాఖలు చేయడానికి అర్హులు కాదని.. కానీ లాగిన్ పోర్టల్‌లో వారి ప్రతిస్పందనలను చూడవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
ఫలితాలు ఎప్పుడంటే..
ఫిబ్రవరి మొదట్లో నిర్వహించిన గేట్ 2025 పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీ ని నేడు విడుదల చేశారు అధికారులు. ఇక, అభ్యర్థులు వారి అభ్యంతరాలను మూల్యాంకనం చేసిన తర్వాత, తుది ఆన్సర్ కీని నిపుణులు విడుదల చేస్తారు. దీని ఆధారంగా, గేట్ 2025 పరీక్ష షెడ్యూల్ ప్రకారం, ఐఐటీ రూర్కీ వచ్చేనెల మార్చి 19, 2025 తేదీకి ఫలితాలను విడుదల చేస్తారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- gate 2025
- gate exam answer key
- engineering entrance exam
- Graduate Aptitude Test in Engineering
- entrance exams for btech
- gate exam answer key released
- answer key download process
- answer key download for gate 2025
- march 1st
- gate exam results date
- gate exam important dates
- gate exam 2025 answer key download process
- end date of gate answer key download
- official website for gate exam
- Education News
- Sakshi Education News
- objection window
- objection window for gate exam answer key 2025
- GATE2025Key
- GATE2025Solutions