AP Inter Board Exams 2025 Hall Tickets : ఏపీ ఇంటర్ బోర్డు పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదల.. రెండు విధాలుగా..

సాక్షి ఎడ్యుకేషన్: వచ్చే నెల మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను బోర్డు అధికారికంగా విడుదల చేసినట్లు ప్రకటించింది. విద్యార్థులు ఈ హాల్‌టికెట్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పాటించాల్సిన నిబంధనలు వంటివి వివరించారు. ఇంటర్ బోర్డు ప్రకారం, విద్యార్థులు వారి హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి లేదా వారి కళాశాల నుంచి, లేదా మొబైల్ నుంచి అందుకోవచ్చు. ఈ మూడు విధానాల్లో విద్యార్థులు తమ బోర్డు పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Intermediate Board Exams 2025: ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం .... ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు
వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్..
1. బీఐఈఏపీ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి.
2. లాగిన్‌లో కనిపిస్తున్న థియరీ హాల్‌టికెట్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఐపీఈ మార్చి 2025 డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. ఇక్కడ అడిగిన ప్రకారంగా మీ వివరాలను నమోదు చేయండి.
4. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. మీ హాల్‌టికెట్ కనిపిస్తుంది. క్షణ్ణంగా పరిశీలించుకొని, ప్రింట్ తీసుకోండి.
వాట్స్‌ప్ నుంచి డౌన్‌లోడ్ ఇలా..
1. మొదట మీ మొబైల్ లేదా ఫోన్‌లో 9552300009 ఈ నంబర్‌ను సేవ్ చేసుకోండి.
2. హాయి అని మేసేజ్ పంపి, సర్వాస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌కి వెళ్లి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.
4. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్‌పై క్లిక్ చేసి, మీ వివరాలను అడిగిన విధంగా నమోదు చేయండి.
5. ఇప్పుడు మీ హాల్‌టికెట్ కనిపిస్తుంది. పూర్తిగా పరిశీలించి, డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి.
AP Intermediate public exams: మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు.. రేపట్నుంచే హాల్‌టికెట్స్ రిలీజ్
జిల్లా కంట్రోల్ రూమ్‌లతో పాటు, ఫిర్యాదుల కోసం 1800 425 1531 టోల్ ఫ్రీ నంబర్‌తో రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని పరీక్షా కేంద్రాలను CCTV లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షిస్తారు అంతేకాకుండా, అత్యవసర వైద్య సేవలు (అంబులెన్స్‌లతో సహా) సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
ఇదిలా ఉంటే, ఈసారి జరగనున్న పరీక్షలకు పూర్తిగా, 1,058,893 మంది విద్యార్థులు 1,535 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు హాజరుకానున్నారు. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న పరీక్షలకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రతీ చర్యలను చేపట్టారు. ఇక, విద్యార్థుల హాల్‌టికెట్లు కూడా విడుదలైయ్యాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- ap inter board exams
- inter board exams hall tickets
- ap inter 1st and 2nd year exams 2025
- Bieap
- inter board latest updates
- ap inter board exams 2025
- ap inter 1st and 2nd year exams hall tickets download
- Andhra Pradesh Intermediate
- hall tickets download for ap inter board exams 2025
- website and whatsapp halltickets
- inter board exams hall tickets from website or whatsapp
- ap inter hall ticket download process
- Education News
- Sakshi Education News
- APExamUpdates