GATE 2025 All India Topper: గేట్ ఫలితాలలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన తెలుగు విద్యార్థి నిఖిల్ చౌదరి

GATE 2025 Toppers గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2025 ఫలితాల్లో తెలుగు విద్యార్థి సత్తా చాటారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆమంచర్లకు చెందిన సాదినేని నిఖిల్ చౌదరి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ పేపర్‌లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 100 మార్కులకు గాను 96.33 మార్కులు పొందారు. పదోతరగతిలో 9.8 సీజీపీఏ, ఇంటర్‌లో 98.6 శాతం మార్కులతో మెరిశాడు. 2017లో నీట్ పరీక్షలో 57వ ర్యాంకుతో రాణించారు. ఎయిమ్స్ ఎంట్రన్స్ పరీక్షలో 22వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ప్రతిష్ఠాత్మక ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ అభ్యసించిన ఆయన.. 2024లో ఐఐటీ మద్రాస్ నుంచి డేటా సైన్స్‌లో ఆన్‌లైన్‌లో డిగ్రీ సైతం పూర్తి చేశాడు.
జాబ్ చేస్తూనే చదువు..
గేట్ 2025 ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన నిఖిల్ చౌదరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో ఎంటెక్ చేయాలన్న గొప్ప ఆశయంతో ప్రిపేరేషన్ కొనసాగించాడు. అతను ప్రస్తుతం నోయిడాలో ఎక్స్‌పర్ట్‌డాక్స్ అనే సంస్థలో పని చేస్తున్నారు. ఈ ప్రయాణంలో ఉద్యోగాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాడు. ఆఫీస్ పని పూర్తయ్యాక రోజూ నాలుగైదు గంటలు చదివేవాడు. ఇక సెలవు రోజుల్లో అయితే 7-8 గంటలు కష్టపడి గేట్ పరీక్ష కోసం ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ కొనసాగించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Telugu student Nikhil Chaudhary secures first rank in GATE results
- GATE Results
- GATE topper 2025
- Nikhil Chaudhary GATE rank
- Telugu student GATE success
- GATE results 2025
- first rank in GATE
- Nikhil Chaudhary achievements
- top GATE scorer
- engineering entrance topper
- inspiring student success stories
- GATE top rank holder