Skip to main content

Journalism PG Diploma Notification : రచన జర్నలిజం కాలేజీలో పీజీ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్‌

Journalism PG Diploma Notification

సమాజంలో జరుగుతున్న అవినీతి, అరాచకాలపై గళమెత్తాలనుకునే యువతకు ఫస్ట్‌ చాయిస్‌ జర్నలిజం. రాజకీయ నాయకుల అక్రమాలు, అవినీతిని అందరికీ తెలియజేయాలన్నా .. అధికారుల అలసత్వాన్ని ప్రశ్నించాలన్నా.. సామాన్య ప్రజల పక్షాన నిలిచి న్యాయం కోసం పోరాడాలనుకున్నా అది జర్నలిస్టులకే సాధ్యమవుతుంది. జర్నలిజాన్ని ఫ్యాషన్‌గా ఎంచుకునే యువతకు రచన జర్నలిజం కళాశాల చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. రెగ్యులర్, కరస్పాండెన్స్‌ విధానంలో పిజీ డిప్లొమా,  సర్టిఫికెట్‌ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పిజీ డిప్లొమా కోర్సులో చేరడానికి ఏదైనా డిగ్రీ, సర్టిఫికెట్‌ కోర్సులో చేరేందుకు పదో తరగతి పాసైనవారు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు కోసం రూ.200 డిడిని రచన జర్నలిజం కళాశాల, హైదరాబాద్‌ పేరు మీద తీసి రచన జర్నలిజం కళాశాల, కేశవ్‌ మెమోరియల్‌ ఎడ్యుకేషనల్‌ క్యాంపస్, దీపక్‌ థియేటర్‌ పక్కవీధి, నారాయణగూడ గూడ, హైదరాబాద్‌ – 500029కు పంపించాలి. అప్లికేషన్లు పొందడానికి చివరితేదీ డిసెంబర్‌ 21.  వివరాలకు 040–23261335, 9959640797 నంబర్లలో సంప్రదించాలి. 
 

Last Date

Photo Stories