Skip to main content

Admission in JNV: జవహర్‌ నవోదయ విద్యాలయలో ఆరో తరగతి ప్రవేశాలు..

జవహర్‌ నవోదయ విద్యాలయ(జేఎన్‌వీ) సంస్థ 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి.. జవహర్‌ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2024కు దరఖాస్తులు కోరుతోంది.
Jawahar Navodaya Vidyalaya Class 6 Admission

అర్హత: విద్యార్థి తప్పనిసరిగా జవహర్‌ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లా నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి.
వయసు: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.05.2012 నుంచి 30.07.2014 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.

ప్రవేశ పరీక్ష: జవహర్‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు(మెంటల్‌ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్‌)ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు  చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.08.2023

వెబ్‌సైట్‌: https://cbseitms.rcil.gov.in/

Last Date

Photo Stories