Skip to main content

Admission in APPSC-RIMC: ఏపీపీఎస్సీ–ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

Eighth Class Admissions in APPSC-RIMC

డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ(ఆర్‌ఐఎంసీ)లో జనవరి 2023 టర్మ్‌ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలుర, బాలికల నుంచి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
వయసు: 01.01.2023 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. 02.01.2010 నుంచి 01.07.2011 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష,వైవా వాయిస్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 25.04.2022
పరీక్ష తేది: 04.06.2022

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

Last Date

Photo Stories