Skip to main content

APPSC RIMC Notification 2022: ఏపీపీఎస్సీ–ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు

APPSC RIMC Notification 2022 8th Class Admissions

డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ(ఆర్‌ఐఎంసీ)లో జూలై 2023 టర్మ్‌ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలురు, బాలికల నుంచి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
వయసు: 01.07.2022 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. 02.07.2010 నుంచి 01.01.2012 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష,వైవా వాయిస్, మె డికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: రాతపరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి మ్యాథమేటిక్స్, జనరల్‌ నాలెడ్జ్, ఇంగ్లిష్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా వాయిస్‌ నిర్వహిస్తారు. దీనిలో కనీసం  50శాతం మార్కులు రావాలి. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా మెడికల్‌ టెస్ట్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్‌ సెక్రటరీ(ఎగ్జామ్స్‌), ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, న్యూ హెడ్స్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్స్‌ బిల్డింగ్, రెండో అంతస్తు, ఆర్టీఏ కార్యాలయం దగ్గర, ఎంజీ రోడ్డు, విజయవాడ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.10.2022
పరీక్ష తేది: 03.12.2022

వెబ్‌సైట్‌: http://www.rimc.gov.in/

Admissions in CAT:క్యాట్‌ 2022 నోటిఫికేషన్‌ ..... ఎవరు అర్హులంటే..

Last Date

Photo Stories