Skip to main content

AP Gurukulam Notification 2023: ఏపీ బీసీ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు

విజయవాడలోని మహాత్మా జ్యోతిబా పులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయా­ల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతి(ఇంగ్లిష్‌ మీడియం, సేట్‌ సిలబస్‌)లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ap bc gurukulam notification 2023

పరీక్ష వివరాలు: మహాత్మా జ్యోతిబా పులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023.
విద్యార్హత: విద్యార్థులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగో తరగతి 2022-23 విద్యా సంవత్సరంలో చదివ ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
వయసు: ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య; ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.
ప్రవేశ పరీక్ష: ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఓఎంఆర్‌ షిట్‌ విధానంలో 50 మార్కులకు ఉంటుంది.ప్రశ్నపత్రం తెలుగు/ఆంగ్ల మాధ్యమా­ల్లో ఉంటుంది. తెలుగు(10 మార్కులు), ఇంగ్లిష్‌(10 మార్కులు),గణితం(15 మార్కులు), ప­రిసరాల విజ్ఞానం(15 మార్కులు)సబ్జెక్టులో నా­లుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.
పరీక్షా కేంద్రం: విద్యార్థుల సంబంధిత జిల్లాలో పరీక్ష నిర్వహిస్తారు.

ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశపరీక్షలో ప్రతిభ,రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ(అనా£ý /మత్స్యకార)ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.04.2023.
ప్రవేశ పరీక్ష తేది: 16.04.2023.

వెబ్‌సైట్‌: https://mjpapbcwreis.apcfss.in/

ఏపీ ఏకలవ్య మోడల్‌ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు

Last Date

Photo Stories