పరిశోధనలతో భవిత ఉజ్వలం!!సీఎస్‌ఐఆర్ యంగ్ సైంటిస్ట్ అవార్డు గ్రహీత మహేశ్వర్ ఓఝా
Sakshi Education
ఐఎస్‌ఎం- ధన్‌బాద్ లో క్యాంపస్ సెలక్షన్ రాలేదని కొంత నిరాశ.. అదే సమయంలో ఎన్‌జీఆర్‌ఐ - హైదరాబాద్‌లో జియో ఫిజిక్స్ విభాగంలో పీహెచ్‌డీలో ప్రవేశం.. అందులో నిరంతర శ్రమ, కొత్త విషయాల గురించి అన్వేషణ, ఆసక్తి.. ఫలితమే జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడానికి కారణం అంటున్నారు సీఎస్‌ఐఆర్ యంగ్ సైంటిస్ట్ అవార్డుకు ఎంపికైన ఎన్‌జీఆర్‌ఐ జూనియర్ సైంటిస్ట్ డాక్టర్ మహేశ్వర్ ఓఝా. దేశంలో పరిశోధనలు పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో విద్యార్థులు పీహెచ్‌డీ వైపు అడుగులు వేస్తే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందంటున్న ఓఝా సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే..
సీఎస్‌ఐఆర్ యంగ్ సైంటిస్ట్ అవార్డుకు ఎంపికవడం పరిశోధన పరంగా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చే అంశం. అదే సమయంలో బాధ్యత కూడా పెరిగింది. ఈ అవార్డుతో సంతృప్తి చెందను. మరిన్ని పరిశోధనలు, కొత్త విషయాల ఆవిష్కరణ చేయాలనే అవసరాన్ని గుర్తు చేస్తున్నట్లుగా ఈ పురస్కారాన్ని భావిస్తాను.
ఈ అవార్డుతో..:
సీఎస్‌ఐఆర్ యంగ్ సైంటిస్ట్ అవార్డుకు ఎంపికవడం వల్ల రూ.లక్షల్లో ప్రోత్సాహకాలు లభిస్తాయి. పురస్కారం కింద రూ.50 వేలు నగదు అందజేస్తారు. దీంతోపాటు 45 ఏళ్ల వయసు వరకు పరిశోధన పారితోషికం కింద నెలకు రూ.7,500 లభిస్తాయి. అంతేకాకుండా.. ఐదేళ్ల వ్యవధిగల పరిశోధన ప్రాజెక్ట్‌కు గాను ప్రతి ఏటా రూ.5 లక్షల ప్రత్యేక ప్రోత్సాహకం లభిస్తుంది.
గ్యాస్ హైడ్రేట్ అన్వేషణకు:
ఎన్‌జీఆర్‌ఐలో జియో ఫిజిక్స్ విభాగంలో పరిశోధనలు చేస్తున్న నేపథ్యంలో.. సముద్ర తీరం వెంబడి గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలను కనుగొనేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ నిక్షేపాలు మన దేశానికి భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తి వనరుగా ఉపయోగపడతాయి. విశాలమైన సముద్ర తీరం కలిగిన మన దేశంలో గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలు విస్తృతంగా ఉన్నాయి. ఇప్పటికే కృష్ణా, గోదావరి, మహా నదీ తీరాల్లో ఇవి బయటపడ్డాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిశోధనలు కొనసాగిస్తే కొన్ని దశాబ్దాలకు సరిపడే ప్రత్యామ్నాయ శక్తి వనరులు లభించినట్లే. అయితే సాంకేతిక పరిజ్ఞానం లోపం కారణంగా ఆశించిన స్థాయిలో ఈ నిక్షేపాలను వెలికి తీయలేకపోతున్నాం.
రీసెర్చ్ వైపు అడుగులు:
ఐఎస్‌ఎం ధన్‌బాద్‌లో అప్లైడ్ జియో ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాను. కానీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఎంపిక కాలేదు. ఎంపికైన సహచరులతో పోల్చుకుని కొంత నిరాశకు గురయ్యాను. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పీహెచ్‌డీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలో.. 2003లో ఎన్‌జీఆర్‌ఐలో రీసెర్చ్ స్కాలర్‌గా అడుగుపెట్టాను. ఇక్కడ ఆసక్తే ఆయుధంగా నిరంతరం శ్రమించి జియో ఫిజిక్స్‌లో పరిశోధనల్లో పాల్పంచుకుంటూనే.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశాను.
పోత్సాహకాలు పెంచాలి:
పరిశోధన దిశగా పీహెచ్‌డీ అభ్యర్థులకు స్టైపెండ్ రూపంలో లభిస్తున్న ప్రోత్సాహకాలు.. ఉద్యోగంలో లభించే జీతం కంటే తక్కువగా ఉంటోంది. దాంతో అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం పరిశోధనల పట్ల ఆసక్తి చూపడం లేదు. పరిశోధనలకు సంబంధించి పరిశ్రమతో కలిసి సంయుక్తంగా పనిచేసే సంస్కృతి కూడా మన దేశంలో చాలా తక్కువగా ఉంది. దీంతో పీహెచ్‌డీ చేసినా ఉద్యోగం వస్తుందా? రాదా? అనే ఆందోళనతో చాలా మంది పీజీ పూర్తి చేశాక ఆదాయాన్వేషణకు ప్రాధాన్యమిచ్చి ఉద్యోగాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితి మారి పరిశోధనల వైపు యువత అడుగులు వేయాలంటే.. ప్రోత్సాహకాలు పెంచాలి. పరిశ్రమలతో కలిసి సంయుక్తం గా పరిశోధనలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
సలహా:
ఉద్యోగం ఒక విధి నిర్వహణకు సంబంధించి ఆదాయాన్ని మాత్రమే అందిస్తుంది. జీవితం యాంత్రికంగా సాగుతుంది. కానీ పరిశోధనల్లో అంతులేని స్వేచ్ఛ లభిస్తుంది. స్వీయ ఆలోచనలతో అనంతమైన అన్వేషణలు సాగించొచ్చు. ఆ క్రమంలో ఎన్నో ఆవిష్కరణలు చేసి.. భవిష్యత్తు తరాలకు చిరస్మరణీయంగా నిలిచే అవకాశం పరిశోధనలతోనే సాధ్యం. ఇప్పటికీ మనం నిరంతరం తలుచుకునే సి.వి.రామన్, సత్యేంద్రనాథ్ బోస్, సర్ జె.సి. బోస్, రామానుజన్, మేఘనాథ్ సాహా వంటి వారే ఇందుకు నిదర్శనం. ఇప్పుడిప్పుడే పరిశోధనల దిశగా ప్రాధాన్యం పెరుగుతోంది. విద్యార్థులు పీహెచ్‌డీ వైపు అడుగులు వేస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎర్‌త సైన్‌సలో పరిశోధనల పరంగా విస్తృత అవకాశాలు ఉన్నాయి.
ప్రొఫైల్
స్వస్థలం: హౌరా (పశ్చిమ బెంగాల్)
విద్యాభ్యాసం:

- 1999లో యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతా నుంచి బీఎస్సీ.
- 2003లో ఐఎస్‌ఎం ధన్‌బాద్ నుంచి ఎంఎస్సీ-టెక్ (అప్లైడ్ జియోఫిజిక్స్).
- 2003 జూన్ నుంచి 2008 వరకు ఎన్‌జీఆర్‌ఐ-హైదరాబాద్‌లో రీసెర్చ్ స్కాలర్‌గా విధులు.
- 2008 ఆగస్టు నుంచి ఎన్‌జీఆర్‌ఐలో సైంటిస్ట్‌గా విధులు.
- 2011లో శాస్త్ర సాంకేతిక శాఖ నుంచి BOYS-CAST ఫెలోషిప్.
- 2012లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఏపీ అకాడమీ ఆఫ్ సైన్స్‌ల నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డు
- 2013 ఆగస్టులో సీఎస్‌ఐఆర్ యంగ్ సైంటిస్ట్ అవార్డు
Published date : 29 Aug 2013 03:14PM