Admissions: ప్రవేశాల కోలాహలం.. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు
శ్రావణ ఆగస్టు 25న కావడంతో ఒకేరోజు ఎక్కువ మంది విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి రావడంతో కాలేజీ ఆవరణ కోలాహంగా కనిపించింది. రాష్ట్ర కోటాలో ఆగస్టు 25న ఒకేరోజు 42మంది విద్యార్థులు చేరగా, జాతీయ కోటాలో ముగ్గురు విద్యార్థులు ప్రవేశం పొందారు. ఇప్పటివరకు రాష్ట్ర కోటాలో 58 మంది, జాతీయ కోటాలో 11 మంది చేరారని, నెలాఖరు నాటికి 100 సీట్లు పూర్తిగా నిండుతాయని ప్రిన్సిపాల్ ఎస్. రాజేశ్వరరావు తెలిపారు.
చదవండి: New Medical College: వైద్య విద్యకు వేళాయె..
సెప్టెంబర్ 1 నుంచి ఇంట్రడక్షన్ తరగతులు
రాష్ట్రంలోని నూతన మెడికల్ కళాశాలలను సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 1న వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఖమ్మం కళాశాలను కూడా అదేరోజు ప్రారంభించనుండడంతో అధికారులు ఏర్పాట్లుచేశారు. ఆరోజు నుంచి 11వ తేదీ వరకు విద్యార్థులకు ఇంట్రడక్షన్ తరగతులు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నే 8న కాలేజ్ విజిట్, 11వ తేదీన ఖమ్మం జనరల్ ఆస్పత్రి పరిశీలన ఉంటాయని, అక్టోబర్‌లో తరగతులు మొదలవుతాయని అధికారులు తెలిపారు.
చదవండి: Andhra Pradesh: అత్యాధునిక సదుపాయాలతో ప్రభుత్వ వైద్య కళాశాల