KNRUHS: పారామెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్
ఈ మేరకు ఆగస్టు 29న ఉత్తర్వులు జారీ చేసింది. బీపీటీ, ఎంపీటీ, ఎంఎస్సీ (నర్సింగ్), పీబీ బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో రిజర్వేషన్ అమలుకు చర్యలు తీసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య చేసింది. తాజా నిర్ణయంతో బీపీటీలో 69 సీట్లు, ఎంపీటీలో 6 సీట్లు, ఎంఎస్సీ నర్సింగ్‌లో 25 సీట్లు, పీబీబీఎస్సీలో 23 సీట్లు ఆ కేటగిరీ విద్యార్థులకు రిజర్వ్ కానున్నాయి.
చదవండి: Health Awareness: గురుకుల బాలిక విద్యార్థులకు ఆరోగ్యశాఖ అందించిన అవగాహన
ఇప్పటికే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, అనుబంధ హెల్త్ సైన్స్, బీఎస్సీ నర్సింగ్ సీట్లలో 10 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎంబీబీఎస్‌లో 203 సీట్లు, ఇతర పారా మెడికల్ కోర్సుల్లోని కాంపిటెంట్ కోటాలో 648 సీట్లు రిజర్వ్ అవుతాయి. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు అవకాశాలు కల్పించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
చదవండి: NEET 2023: మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందన