పీజీ మెడికల్ ప్రవేశాలకు ప్రకటన
Sakshi Education
పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి జనవరి 25 నుంచి 27వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్రంలోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.
ఈ మేరకు జనవరి 24న మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలకు అదే విధంగా నిమ్స్ మెడికల్ కళాశాలలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. జనవరి 25న ఉదయం 8 గంటల నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను చూడాలని వర్సిటీ కోరింది.
చదవండి:
High Court: అలా ఫీజు ఎలా పెంచుతారు?
Published date : 25 Jan 2022 05:09PM