NEET 2022: నీట్ యూజీ రాష్ట్ర అర్హుల జాబితా విడుదల
డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్‌ఎస్) నుంచి అందిన సమాచారం మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలిసేందుకు జాబితాను ప్రదర్శించినట్లు వెల్లడించారు. జాబితా ప్రకారం 710 స్కోర్‌తో జాతీయ స్థాయిలో 12వ ర్యాంక్ సాధించిన ఎం.దుర్గసాయి కీర్తి తేజ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. 15వ ర్యాంక్‌తో ఎన్.వెంకటసాయివైష్ణవి రెండో స్థానంలో, 25వ ర్యాంక్‌తో జి.హర్షవర్ధన్ మూడో స్థానంలో ఉన్నారు. తొలి పది స్థానాల్లో ఐదుగురు యువకులు, ఐదుగురు యువతులున్నారు. జనరల్ కేటగిరీలో 50 పర్సంటైల్ 117 స్కోర్, జనరల్ వికలాంగ కేటగిరీలో 45 పర్సంటైల్ 105 స్కోర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో వికలాంగులతో కలిపి 40 పర్సంటైల్, 93 కటాఫ్ స్కోర్ ఆధారంగా 40,097 మంది విద్యార్థులతో జాబితాను ప్రదర్శించారు.
చదవండి:
MBBS & BDS Seats : ఏపీ, తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు ఇవే.. ఈసారి మాత్రం..
NEET Cut Off 2022 : ఈ సారి నీట్ యూజీ-2022 కటాఫ్ మార్కులు ఇంతేనా..?