Skip to main content

NEET : నీట్‌ రద్దు కోసం..కేటీఆర్‌‌ను క‌లిసిన త‌మిళ‌నాడు ఎంపీలు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌‌తో డీఎంకే ఎంపీలు అక్టోబ‌ర్ 13వ తేదీన భేటీ అయ్యారు.

నీట్ రద్దు చేయాలనే డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని పలువురు ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను డీఎంకే ఎంపీలు టీకేఎస్‌ ఎలాన్గోవన్‌, రామస్వామితో కలిసి కేటీఆర్‌కు అందజేశారు.

కేంద్ర విధానంపై..
అనంతరం డీఎంకే ఎంపీ ఎలెన్గోవన్‌ మాట్లాడుతూ.. నీట్‌ పరీక్ష రద్దు అంశంపై కేటీఆర్‌ను కలిశాము. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నీట్‌ పరీక్ష అంశంపై మేము నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర విధానంపై మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మాకు సపోర్ట్ చెయ్యాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని అడిగాము. అందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కీలకమైన అంశాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడం లేదు అని ఎంపీ ఎలాన్గోవన్‌ అన్నారు. 

కేటీఆర్‌కి స్వయంగా..
ఇదే అంశంపై టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. నీట్‌ రద్దు అంశంపై ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్‌ కేసీఆర్‌కు లేఖ రాశారు. అందుకు మద్దతు కోసం డీఎంకే ఎంపీలు కేటీఆర్‌ను కలిశారు. లెటర్‌ తీసుకొచ్చి కేటీఆర్‌కి స్వయంగా అందించి మద్దతు అడిగారు అని ఎంపీ రంజిత్‌ రెడ్డి తెలిపారు.

Published date : 14 Oct 2021 11:27AM

Photo Stories