న్యాయ విద్యార్థులకు నైపుణ్యాలు తప్పనిసరి
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహనరావు సూచించారు.
గుంటూరులోని జేసీ లా కళాశాలలో రెండవ జాతీయ స్థాయి మూట్ కోర్టు పోటీలను ఫిబ్రవరి 3న ఆయన ప్రారంభించారు. కె.రామమోహనరావు మాట్లాడుతూ యువ న్యాయవాదులుగా రాణించేందుకు విద్యార్థులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విద్యార్థులకు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, నైతిక విలువలు ఎంతో ముఖ్యమని చెప్పారు.
చదవండి:
నీట్ ఫౌండేషన్‌తో ఉన్నత విద్యామండలి ఎంవోయూ
Published date : 04 Feb 2023 03:18PM