Skip to main content

APSCHE: ఏపీ సెట్స్‌ తుదీలు ఇవే..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఈఏపీ సెట్‌)ను మే 15 నుంచి నిర్వహించనున్నారు.
APSCHE
ఏపీ సెట్స్‌ తుదీలు ఇవే..

ఈ మేరకు ఉన్నత విద్యామండలి జనవరి 23న షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈఏపీసెట్‌లో భాగంగా మే 15 నుంచి 22 వరకు ఎంపీసీ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఇక మే 23, 24, 25 తేదీల్లో బైపీసీ విభాగం ప్రవేశపరీక్షలు ఉంటాయి. 

ఈసారి ముందుగానే.. 

రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఇతర ప్రవేశపరీక్షల షెడ్యూళ్లను కూడా ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీజీసెట్, ఆర్‌సెట్లను గతంలో కన్నా ముందుగా నిర్వహించి.. త్వరగా ప్రవేశాలు పూర్తి చేసేలా షెడ్యూళ్లను రూపొందించింది. 

గాడిన పడనున్న విద్యా సంవత్సరం.. 

గతంలో కరోనాతో ప్రవేశపరీక్షల నిర్వహణ ఆలస్యం కావడంతో విద్యాసంవత్సరం గాడితప్పింది. ఈ పరిస్థితి మన రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా నెలకొంది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి 2023–24 విద్యాసంవత్సరానికి ప్రవేశ పరీక్షలను గతంతో పోలిస్తే చాలా ముందుగానే పూర్తి చేసేలా వివిధ సెట్ల షెడ్యూళ్లను రూపొందించింది. ఫలితంగా ఈసారి విద్యా సంవత్సరం గాడిలో పడటానికి ఆస్కారమేర్పడింది. ఈసారి ఈఏపీసెట్‌ పరీక్షలను గతేడాది కంటే రెండు నెలలు ముందుగా అంటే మే 15 నుంచే ప్రారంభించనుండడం విశేషం. దీనివల్ల జూన్‌ ఆఖరుకల్లా అడ్మిషన్లతో సహా మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో జూలై నుంచే తరగతులు ప్రారంభించవచ్చని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొన్నాయి. 

చదవండి: ఏపీ ఈఏపీసెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

సెట్ల తేదీలు ఇలా.. 

ప్రవేశ పరీక్ష

ఏ కోర్సుల్లో ప్రవేశానికి?

పరీక్ష తేదీ

ఈసెట్‌       

 ఇంజనీరింగ్‌ సెకండియర్‌ 

మే 5

లాసెట్‌       

 బీఎల్, ఎంఎల్‌           

మే 20

ఎడ్‌సెట్‌      

  బీఈడీ                   

మే 20

ఐసెట్‌        

  ఎంబీఏ, ఎంసీఏ          

మే 25, 26

పీజీఈసెట్‌   

 ఎంటెక్, ఎంఫార్మసీ          

మే 28 – 30

పీజీసెట్‌     

 అన్ని వర్సిటీల్లో పీజీ         

జూన్‌ 6 –10

ఆర్‌సెట్‌        

పీహెచ్‌డీ

   జూన్‌ 12 – 14

Published date : 24 Jan 2023 03:05PM

Photo Stories