TSSA: ‘ఎల్‌ఎల్‌ఎం కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించండి’
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఎల్‌ఎల్‌ఎం కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించాలని టీఎస్ అడ్మిషన్స్ కన్వీనర్ రమేశ్‌బాబును విద్యార్థులు కోరారు.
![Hyderabad Education News, LLM Counseling Registration at Osmania University, Extend LLM Counseling Registration Deadline, TS Admissions Convenor Ramesh Babu,](/sites/default/files/images/2024/03/29/students12-1691652639-1711693038.jpg)
ఈమేరకు నవంబర్ 20న సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ (టీఎస్‌ఎస్‌ఏ) రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ల అజయ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కన్వీనర్‌కు వినతిపత్రం అందించారు.
చదవండి: Admissions: న్యాయ విద్యలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభం
కాకతీయ, తెలంగాణ వర్సిటీల్లో ఎల్‌ఎల్‌బీ ఫలితాలు విడుదల కాలేదని, మరికొన్ని వర్సిటీల్లో మార్కుల జాబితాలను, ఇతర సర్టిఫికెట్లను జారీ చేయలేదని వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మామిడి శంకర్, లింగంపల్లి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 21 Nov 2023 11:23AM